E-Paper
Advertisement

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?
Advertisement

Mirzapur Box Office:డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో దుమ్ములేపిన ‘మిర్జాపూర్’ఇపుడు సిల్వర్ స్క్రీన్ పై అదే రేంజ్ లో రచ్చ చేస్తుంది. అవును..పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిర్జాపూర్ ది మూవీ’ థియేటర్లలో సాలిడ్ వసూల్లని రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

సినిమా రిలీజ్ కి ముందే భారీ అంచనాలని మోసిన ఈ సినిమా వాటిని నిజం చేస్తూ ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి నేషనల్ వైడ్ గా రూ.145 కోట్ల నెట్ వసూళ్లని కొల్లగొట్టింది.

Advertisement

మొదటి రోజు ఇండియా వైడ్ గా

ఒక రకంగా ఈ సినిమా కలెక్షన్స్ ఈ స్థాయిలో వస్తుండటం చూసి ట్రేడ్ వర్గాలే షాక్ కి గురవుతున్నాయి.మొదటి రోజు ఇండియా వైడ్ గా దాదాపు 27 కోట్ల నెట్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు ఏకంగా దాదాపు 33 కోట్లకి పైగా వసూలు చేయడం చూస్తుంటే ఆడియన్స్ సినిమాని ఎంతలా ఆదరిస్తున్నారో అర్థమవుతుంది.

Advertisement

ఇక మూడో రోజు ఆదివారం కావడం ఈ సినిమాకి బాగా కల్సి వచ్చిందనే చెప్పాలి. అవును ..ఆదివారం ఏకంగా రూ.37 కోట్లకి పైగా భారీ వసూళ్లని ఈ సినిమా కొల్లగొట్టిందని సమాచారం.

దాదాపుగా రూ.140కోట్లకి పైగానే

అయితే వీక్ డేస్ లో కలెక్షన్స్ కాస్త నెమ్మదించినప్పటికీ నాలుగో రోజు రూ.17 కోట్లు, ఐదో రోజు రూ.16 కోట్లు, ఆరో రోజు రూ.1౩కోట్లని వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది .ఇక మొత్తంగా ఇండియా వైడ్ గా ఆరు రోజుల్లో ఈ సినిమా దాదాపుగా రూ.140కోట్లకి పైగానే వసూలు చేసినట్టు తెలుస్తుంది .ఇక ఏడో రోజు వచ్చినప్పటికీ కలెక్షన్స్ లో ఎక్కడా డ్రాప్ లేకుండా కోటికీ పైగానే కలెక్షన్స్ రాబట్టడం విశేషం.

ఏకంగా 198 కోట్ల గ్రాస్

మరోవైపు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి తొలి ఆరు రోజుల్లోనే దాదాపు రూ.29 కోట్ల గ్రాస్ రావడం అంటే అంత ఆషామాషీ కాదు.ఇక ఇండియా, ఓవర్సీస్ రెండూ కలిపితే ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఏకంగా 198 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తుంది.

సినిమాని ఇంకెంత దూరం తీసుకు వెళ్తారో !

ఇక ఈ సినిమా విషయానికి వస్తే గూర్మీత్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి (కాలీన్ భయ్యా), అలీ ఫజల్ (గుడ్డు పండిట్), దివ్యేందు (మున్నా త్రిపాఠి) తమ నటనతో ఆడియన్స్ ని అలరించగా రసికా దుగ్గల్, శ్వేతా త్రిపాఠి, జితేంద్ర కుమార్ వంటి నటులు సినిమాలో కీ రోల్స్ పోషించి సినిమాని మరో మెట్టు ఎక్కించారు .

ALSO READ:హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

చూడాలి మరి కాలీన్ భయ్యా,గుడ్డు పండిట్, మున్నా త్రిపాఠిలు కలిసి సినిమాని ఇంకెంత దూరం తీసుకు వెళ్తారో !

Tags

Related News

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×