BigTV English

SSMB 29 Update : ఫ్రాంఛైజీగా జక్కన్న మూవీ… ఎన్ని వందల కోట్లు పెడుతున్నారో తెలుసా ?

SSMB 29 Update : ఫ్రాంఛైజీగా జక్కన్న మూవీ… ఎన్ని వందల కోట్లు పెడుతున్నారో తెలుసా ?

SSMB 29 Update :దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29.. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా, ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కీలక పాత్రలో ఈ చిత్రం రాబోతోంది. ముఖ్యంగా దేశ విదేశాలకు చెందిన నటీనటులు ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు ఇదివరకే ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే సంతోషం, హలో బ్రదర్ వంటి చిత్రాలను నిర్మించి, మంచి గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీ దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తో కేఎల్ నారాయణ (KL Narayana)ఈ సినిమాను నిర్మిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.


ఎస్ఎస్ఎంబి 29 మూవీపై ఊహించని అప్డేట్..

అయితే ఇప్పుడు ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది కెన్యా మీడియా. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు కెన్యాలో జరుగుతోంది. ఈ సందర్భంగా రాజమౌళి కెన్యా మంత్రి ముసాలియా ముదావాది (Musalia W Mudavadi)ని కలవడం జరిగింది. ఈ మేరకు అక్కడ జరిగిన మీటింగ్లో ఎలాంటి విషయాలు మాట్లాడారు అనే విషయంపై మంత్రి ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కలయిక అనంతరం కెన్యా న్యూస్ పేపర్ ఒక వార్త ప్రచురించడంతో ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో అంచనాలు పెంచేసింది.


ఫ్రాంఛైజీగా రాబోతున్న ఎస్ఎస్ఎంబి29..

అసలు విషయంలోకి వెళ్తే.. ఎస్ఎస్ఎంబి 29 సింగిల్ మూవీ కాదు అని.. ఇది రెండు పార్ట్స్ కలిగిన ఫ్రాంచైజీ అని.. ఈ రెండు భాగాలకు సుమారుగా రూ.1200 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు అంటూ ఈ వార్త కెన్యా న్యూస్ పేపర్లో ప్రధమంగా ప్రచురించబడింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమాపై అందరూ అంచనాలు మరింత పెంచుకుంటున్నారు. పైగా రెండు భాగాలుగా రాబోతున్న ఈ ఎస్ఎస్ఎంబి 29 మూవీ మొదటి భాగం ఎక్కడ ఎండ్ కానుంది..? రెండవ భాగంలో ఎలాంటి కథ చూపించబోతున్నారు.. ?అసలు ఈ రెండు సినిమాలు పూర్తవడానికి ఇంకెంతకాలం పడుతుంది.. ? యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ఏ విధంగా చూపించబోతున్నారు? అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కెన్యా మంత్రిని కలిసిన తర్వాత అక్కడి న్యూస్ పేపర్ ప్రచురించిన వార్త పలు అంచనాలు పెంచేస్తోందని చెప్పవచ్చు.

కెన్యా మంత్రితో భేటీ..

ఇకపోతే రాజమౌళి బృందం కెన్యా మంత్రితో భేటీ అయిన తర్వాత ఆయన సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు పంచుకున్నారు. “గత రెండు దశాబ్దాలుగా రాజమౌళి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎంతో విజన్ కలిగిన వ్యక్తి. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించిన తర్వాత.. 120 మందితో కూడిన రాజమౌళి బృందం కెన్యాని ఎంచుకోవడం మాకు మరింత ఆనందంగా ఉంది. 100 కోట్ల మందికి పైగా చేరువయ్యే ఈ సినిమా 120 దేశాలలో విడుదల కాబోతోంది. ముఖ్యంగా కెన్యాలో షూటింగ్ చేయడం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ వేదికపై మా దేశ అందాలను, ఆతిథ్యాన్ని చూపించడంలో ఈ సినిమా శక్తివంతంగా పనిచేయనుంది. ముఖ్యంగా ఈ సినిమాతో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది” అంటూ ఆయన తెలిపారు. ఇక ఈ మీటింగ్ తర్వాతనే అలా న్యూస్ పేపర్ లో ఈ వార్తలు వైరల్ గా మారాయి.

also read:Sonakshi Sinha: ఆ వెబ్ సైట్ లకు లీగల్ నోటీసులు.. తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫైర్!

Related News

Shilpa Shetty: తన రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన శిల్పాశెట్టి .. అదే కారణమా..?

Kotha Lokah : అనుష్క, కీర్తి సురేష్‌ను దాటేసిన కళ్యాణీ ప్రియదర్శణ్… ఒక్క సినిమాతో నెంబర్ ప్లేస్..

KishkindhaPuri Trailer: దెయ్యంలా మారిన అనుపమ… థియేటర్‌లో మరి భయపడుతారా ?

Emraan Hashmi: ఓమీ.. టాలీవుడ్ లో బాగా వినిపించే పేరు అవుతుంది

Soubin Shahir: కూలీ నటుడికి హై కోర్టు బిగ్ షాక్… విదేశాలకు వెళ్లడానికి నో పర్మిషన్..

Pookie: ఛీఛీ.. ఇదెక్కడి దిక్కుమాలిన టైటిల్ రా.. కొంచెం కూడా సిగ్గు లేదా.. విజయ్ ఆంటోనీ

Big Stories

×