Sonakshi Sinha: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఫ్యాషన్ ఐకాన్ గా కూడా పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినూత్నమైన డ్రెస్ లతో, అద్భుతమైన జ్యువెలరీ మోడల్స్ తో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తూ ఉంటుంది. అలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్స్ ను ఆకట్టుకునే ఈమె తాజాగా ఈ-కామర్స్ వెబ్ సైట్ లకు లీగల్ నోటీసులు జారీ చేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కొన్ని వెబ్ సైట్ లు తన అనుమతి లేకుండా తన ఫోటోలు వాడుకుంటున్నారని.. పూర్తి వివరాలు వెల్లడించక ముందే వెంటనే డిలీట్ చేయాలని లేకపోతే మరింత కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించింది.
నా ఫోటోలు కనిపించి షాక్ అయ్యాను – సోనాక్షి
ఈ మేరకు సోనాక్షి సినిమా ఒక లాంగ్ నోట్ విడుదల చేస్తూ.. సాధారణంగా నేను ఎక్కువగా ఆన్ లైన్ లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను.. అలా షాపింగ్ చేసే సమయంలో అనుకోకుండా నా ఫోటోలు కనిపించి షాక్ అయ్యాను. ముఖ్యంగా కొన్ని బ్రాండెడ్ ఈ – కామర్స్ వెబ్ సైట్ లలో నా ఫోటో కనిపించింది. వారంతా నా అనుమతి లేకుండా, నన్ను సంప్రదించకుండా ఏమాత్రం ముందు జాగ్రత్త వహించకుండా నా ఫోటోలను ఉపయోగించుకున్నారు. ఇది నేను సహించలేకపోతున్నాను. ఒక నటిగా ఎప్పటికప్పుడు నేను కొత్త కొత్త దుస్తులు, ఆభరణాలు ధరిస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఆ డ్రెస్ వివరాలతో పాటు జువెలరీ వివరాలు కూడా అందుకు తగ్గ బ్రాండ్ కే క్రెడిట్ ఇస్తూ నేను పోస్ట్ చేస్తాను.
ఈ – కామర్స్ వెబ్ సైట్ లకి సోనాక్షి లీగల్ నోటీసులు..
కానీ ఈ వెబ్ సైట్ లు మాత్రం నా అనుమతి లేకుండా ఫోటోలు ఎలా వాడుకుంటారు? వారికి లభించాల్సిన క్రెడిట్ మీరు కొట్టేయడం ఎంతవరకు సమంజసం.. కనీసం నైతిక బాధ్యత కూడా వహించరా ? పేరుకే పెద్ద పెద్ద బ్రాండ్ లు.. ఇలా తప్పు దోవ పట్టించే పనులు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు.. ముఖ్యంగా నేను వివరాలు వెల్లడించక ముందే నా ఫోటోలు తొలగించండి.. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాను.. చెప్పిన మాట వినకపోతే ఆయా వెబ్సైట్లకు లీగల్ నోటీసులు కూడా పంపిస్తాను.. ఇప్పటికే కొన్ని వెబ్సైట్లకు లీగల్ నోటీసులు కూడా పంపించాను” అంటూ తెలిపింది సోనాక్షి సిన్హా. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సోనాక్షి సిన్హా సినిమాలు..
సోనాక్షి సిన్హా సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ లో సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా నటిస్తున్న ‘జటాధర’ సినిమాలో సోనాక్షి హీరోయిన్ గా నటిస్తోంది. పౌరాణిక, మిస్టరీ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రేరణ అరోరాతో కలిసి.. అరుణ అగర్వాల్, శిల్ప సింఘాల్, సివిన్ నారంగ్ , నిఖిల్ నందా తదితరులు నిర్మిస్తున్నారు. ఇందులో శిల్ప శిరోద్కర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.ఇటీవలే ‘నిఖిత రాయ్’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.
also read:SSMB 29: రాజమౌళి మూవీపై కెన్యా మంత్రి బిగ్ అప్డేట్… ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా?