Betel Leaves: తమలపాకు గురించి మనందరికీ తెలిసిందే. దేవాలయాల్లో పూజలలో, శుభకార్యాలలో, హారతులకు తమలపాలకు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. తమలపాకు గురించి మనందరికీ తెలిసిందే. దేవాలయాల్లో పూజలలో, శుభకార్యాలలో, హారతిలకు తమలపాకు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కానీ తమలపాకు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కూడా కలిగిందని మీకు తెలుసా? తమలపాకులో కొద్దిగా మిరియాల పౌడర్ వేసి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి.
తమలపాకుతో ఇలా చేయండి..
ఒక తాజాగా తీసుకున్న తమలపాకు మీద కొద్దిగా మిరియాల పొడి వేసి దానిని నెమ్మదిగా నమలాలి. నమిలేటప్పుడు రసాన్ని నోట్లో నెమ్మదిగా పంచుకొని మింగాలి. దీన్ని రోజూ క్రమంగా చేస్తే శరీరానికి అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. ఇలా చేస్తే ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. తరచూ గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి ఇబ్బందులు ఎదుర్కునే వారికి ఇది సహజమైన ఔషధంలా పనిచేస్తుంది. తమలపాకు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మిరియాల వేడి శరీరంలో ఉన్న సూక్ష్మ అంశాలు బయటికి పంపే శక్తి కలిగిస్తుంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇలా చేయడం వల్ల కఫ సమస్యలు, దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి. ప్రత్యేకంగా వర్షాకాలం లేదా చలికాలంలో తరచూ జలుబు, దగ్గు వచ్చే వారికి ఇది చాలా ఉపయోగకరం.
Also Read: SSMB 29: రాజమౌళి మూవీపై కెన్యా మంత్రి బిగ్ అప్డేట్… ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా?
నెల పాటు పాటిస్తే మీ శరీరంలో అద్భుతం ప్రయోజనాలు
రోజూ ఒక నెల పాటు ఈ పద్ధతిని పాటిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్యం మీ దగ్గరకు రాకుండా చేస్తుంది. శరీరానికి అవసరమైన సహజ రక్షణ ఏర్పడుతుంది. అలాగే రక్తం శుద్ధి అవ్వడంలో, కాలేయం సరిగా పనిచేయడంలో కూడా ఇది సహాయం చేస్తుంది.
రోజంతా ఉత్సాహంగా ఉంటారు
మిరియాల పొడి రక్తప్రసరణను మెరుగుపరచి శరీరంలో ఉత్సాహాన్ని పెంచుతుంది. తమలపాకు సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటంతో నోటి దుర్వాసన, దంత సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.
మిరియాలు ఎక్కువ వాడకూడదు
అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మిరియాలు ఎక్కువగా వేసి తినకూడదు. కొద్దిగా మాత్రమే వేసి తినాలి. అలాగే ఈ పద్ధతిని పిల్లలకు, గర్భిణీలకు లేదా ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుని సలహా లేకుండా చేయకూడదు. తమలపాకు, మిరియాల కలయిక మన శరీరానికి ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా పాటిస్తే జలుబు, దగ్గు, జీర్ణకోశ సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం బాగుంటుంది.