King Dom: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన కింగ్ డం(King Dom) సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా జూలై 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఇక సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ అన్ని కూడా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ కు మంచి ఆదరణ లభించడమే కాకుండా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ కావడంతో ఈ సినిమా విజయంపై అభిమానులలో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
క్యామియో పాత్రలో స్టార్ హీరో…
ఇక ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా విజయ్ దేవరకొండ నిర్మాత నాగ వంశీ ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు. ఇకపోతే ఇటీవల కాలంలో సినిమాలలో స్టార్ హీరోలు క్యామియో పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కూడా ఒక స్టార్ హీరో క్యామియో పాత్రలో (Cameo Role)కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.
థియేటర్లోనే చూడాల్సిందేనా…
తాజాగా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండకు ఈ పాత్ర గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ చివరిలో కనుక గమనిస్తే ఒక స్టార్ హీరో క్యామియో పాత్రలో నటించారని తెలుస్తోంది.. నిజమేనా? ఆ హీరో ఎవరో తెలుసుకోవచ్చా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ అది ఎవరో తెలుసుకోవాలి అంటే థియేటర్లోనే సినిమా చూడాలని సమాధానం ఇచ్చారు. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో నటించారని ఈ సందర్భంగా తెలియజేశారు. దీంతో కొంతమంది అభిమానులు ఆ హీరో ఎక్కడ అంటూ మరోసారి ట్రైలర్ లో వెతకడం మొదలు పెట్టారు. ఈ సినిమాలో క్యామియో పాత్రలో నటించిన ఆ హీరో ఎవరా అంటూ చర్చలు కూడా జరుపుతున్నారు.
ఇలా సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఈ విధమైనటువంటి ట్విస్ట్ రివిల్ చేయడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నామని ఈయన ధీమా వ్యక్తం చేశారు. ఇందులో సూరీ అనే ఒక కానిస్టేబుల్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఆపరేషన్ నిమిత్తం ఈయన తన పోలీస్ జాబ్ పక్కన పెట్టి అండర్ కవర్ ఆపరేషన్ మొదలు పెడతారు. అయితే ఈ ఆపరేషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు?ఎందుకు ఆయన మాఫియాలో చేరిపోయారు? అనే విషయాల పట్ల ఎంతో ఆసక్తి నెలకొంది. మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: HHVM OTT: ఆ స్టార్ హీరో పుట్టినరోజు స్పెషల్.. ఓటీటిలోకి రాబోతున్న వీరమల్లు?