Bigg Boss 9 Contestant List: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో వస్తుందంటే చాలు బుల్లితెర ఆడియన్స్కి పండగే. సీరియల్స్ సైతం పక్కన పెట్టి షో చూసేస్తారు. అంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ రియాలిటీ షో అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించిది. హిందీలో అయితే ఏకంగా 19 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక తెలుగులో 8 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు తొమ్మిదవ సీజన్కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 7న ఈ షో ప్రారంభం కానుందని సమాచారం. ఈసారి బిగ్బాస్ సరికొత్తగా ఉండబోతుంది.
కేవలం టాస్క్, ట్రాక్స్ మాత్రమే కాదు అంతకు మించి ఉంటుందని, కొత్త రూల్స్, బోల్డ్ మూవ్స్, హై వోల్టెజ్ ఎంటర్టైన్మెంట్స్తో ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఇక ఈ సారి సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా హౌజ్ ఎంట్రీ కల్పిస్తున్నారు. ఈసారి షోలో పలువురి సెలబ్రిటీలతో పాటు కామనర్స్, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్లు కూడా ఉండబోతున్నారు. ఈసారి నాగార్జునే షోకి హోస్ట్గా ఉండనున్నారు. అయితే తాజాగా బిగ్బాస్ 9లో పాల్గొనే కంటెస్టెంట్స్ వివరాలు బయటకు వచ్చాయి. అంతేకాదు షో పాల్గొనేది వీరే అంటూ పేర్లతో సహా జాబితా వచ్చింది. ప్రస్తుతం ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈసారి కంటెస్టెంట్స్ వీరే
సీరియల్ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్ దీప్ భార్య తేజస్వీని గౌడ, వివాదస్పద నటి కల్పిక గణేష్, కాంట్రవర్సల్ బ్యూటీ అలేఖ్యా చిట్టిపిక్కిల్స్, ఇమ్మాన్యుయేల్, స్వామి, సుమంత్ అశ్విన్, జ్యోతి రాయ్, ముఖేష్ గౌడ, సాయి కిరణ్లు కన్ఫాం కంటెస్టెంట్స్ అంటున్నారు. అలాగే శ్రావణి వర్మ, ఆర్జే రాజ్, దేబ్జానీ, రితూ చౌదరి, దీపిక, సీతకాంత్, హరీక, ఎక్నాథ్, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్ రేఖా భోజ్లు సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇది రూమర్ మాత్రమే. దీనిపై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ టీం లాంచ్ వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా బిగ్ బాస్ టీం చివరి వరకు కంటెస్టెంట్స్ వివరాలను గొప్యంగా ఉంచుతుందనే విషయం తెలిసిందే.
సామాన్యుల ఎంపిక ఇలా
కాగా బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్స్ గా వచ్చే సామాన్యులకు మొదట టీం ‘అగ్నీ పరీక్ష‘ పెట్టబోతుందట. ఇందులో గెలిచిన వారిని సెలక్ట్ చేసి హౌజ్లోకి పంపిస్తారట. ఇలా మొత్తం 40 మందిని సెలక్ట్ చేసి వారిలో కొందరిని మాత్రమే ఫైనల్ చేస్తారట. మరిచేస్త. ఈ అగ్ని పరీక్షకు యాంకర్ శ్రీముఖీ హోస్ట్‌గా వ్యవహరించనుందట. కాగా ఈసారి ప్రైజ్ మనీ కూడా భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఈసారి బిగ్ బాస్ సరికొత్తగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతుందని అర్థమైపోతుంది.
Also Read: Ravi Teja ART Theatre: రవితేజ ART సినిమాస్ లోపల ఎలా ఉందో చూశారా? చూస్తే అబ్బా.. అనాల్సిందే!