HHVM OTT: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu). డైరెక్టర్ జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులకు కావలసినంత వినోదం లేకపోవడంతో అభిమానుల్లో చిన్న నిరాశ ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా, మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చిరంజీవి పుట్టినరోజు…
ఇక ఈ సినిమా జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ
ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) కొనుగోలు చేశారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు(Chiranjeevi Birthday)ను పురస్కరించుకొని ఈ సినిమాని ఆగస్టు 22వ తేదీ ఓటీటీలో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఇంకా అమెజాన్ అధికారిక ప్రకటన వెల్లడించలేదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
ఓజీ పైనే ఆశలు…
ఇక హరిహర వీరమల్లు సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈయన సినిమా నుంచి తప్పుకోవడంతోనే ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకుడిగా మారారు అయితే ఈ సినిమాని డైరెక్టర్ జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేయలేకపోయారని వాదన కూడా వినపడుతోంది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిన తదుపరి రాబోయే సినిమాపై మాత్రం భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఓజీ సినిమా( OG Movie) సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
కొత్త సినిమాలకు కమిట్ అవుతారా?
ఇప్పటికే సినిమా షూటింగ్ పనులు పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఎట్టి పరిస్థితులలోను వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని కచ్చితంగా సెప్టెంబర్ 25వ తేదీ విడుదల కాబోతుందని చిత్ర బృందం పలు సందర్భాలలో వెల్లడించారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఇటీవల షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఇలా పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి కావడంతో తదుపరి ఈయన కొత్త సినిమాలకు కమిట్ అవుతారా? లేకపోతే పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా రాజకీయాలలోనే కొనసాగుతారా?అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.
Also Read: Vijay Devarakonda: గతంలో అగ్రెసివ్.. ఇప్పుడు సైలెంట్.. అదే కారణం అంటున్న విజయ్!