BigTV English

OG Bookings : ఛీ ఛీ.. కాసులకు కక్కుర్తి పడి.. బ్లాక్ టికెట్స్ దందాలోకి డిస్ట్రిబ్యూటర్స్ ?

OG Bookings : ఛీ ఛీ.. కాసులకు కక్కుర్తి పడి.. బ్లాక్ టికెట్స్ దందాలోకి డిస్ట్రిబ్యూటర్స్ ?

OG Bookings : సినిమా ఇండస్ట్రీలో కొంత మంది ఉంటారు. వాళ్లు చేయాల్సిన పనులు ఉంటాయి. కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. ఆ పనులు ఎవరైనా చేసినా.. వాళ్లు ఖండించాలి. వారిపై పోలీసులతో చర్యలు తీసుకునేలా చేయాలి. అలాంటి బాధ్యత ఎవరికి ఉందంటే… నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్.


నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇలా చేస్తే ఆడియన్స్ నమ్మకంతో థియేటర్‌కి వస్తారు. సినిమాలు ఆడుతాయి. ఇండస్ట్రీ బాగుపడుతుంది. కానీ, ఇలా రక్షణగా ఉండాల్సిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భక్షకులు అయ్యారు. బ్లాక్ టికెట్ దందాలను అరికట్టాల్సిన వాళ్లే… రంగంలోకి దిగి బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నారు. ఆ… డిటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పవన్ క్రేజ్..

ఓజీ మూవీ. ఈ సినిమాకు ఇప్పుడు ఎంత హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి మూవీ యూనిట్ అసలు ప్రమోషన్స్ ఏం చేయలేదు. అయినా… భారీ హైప్ ఆ సినిమాపై ఉంది. కారణం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా అది. అందుకే ఇంత హైప్ ఉంది. దాదాపు అందరు కూడా ప్రీమియర్స్ షోలే చూడాలని అనుకుంటున్నారు.


టికెట్ ధర 800 రూపాయలు..

ఇప్పుడు ఉన్న హైప్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఒక్క రోజు ముందు రాత్రి ప్రీమియర్స్ షోలకు అనుమతులు ఇచ్చాయి. అలాగే ఈ ప్రీమియర్ షోలకు టికెట్ ధర 800 రూపాయలు అని నిర్ణయించాయి. సాధారణంగా అన్నీ సినిమాలకు ముందు రోజు రాత్రి నిర్వహించే ప్రీమియర్ షోలకు 800 రూపాయలే ఉంటుంది. ఇప్పుడు ఓజీకి కూడా అంతే ఉంది.

బ్లాక్ దందాలోకి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ?

నిజానికి ఇండస్ట్రీలో ఈ బ్లాక్ టికెట్స్ దందాను నిర్మూలించాల్సిన బాధ్యత ఈ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లపై ఉంటుంది. కానీ, కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు స్వయంగా రంగంలోకి దిగి… బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నారు. 800 రూపాయలు ఉన్న టికెట్ ధరను ఏకంగా 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచి అమ్ముతున్నారు. థియేటర్స్‌ ఓనర్స్‌తో కుమ్మక్కు అయి… వారి టికెట్స్ అన్నీ కొనుగోలు చేసి… బ్లాక్‌లో అమ్ముతున్నారు.

బ్లాక్ దందాకు సపోర్ట్ ?

ఈ బ్లాక్ టికెట్స్ దందాకు కొంతమంది సపొర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. సపొర్ట్ చేయడమే కాదు… వాళ్ల ఆఫీస్‌లోనే ఈ బ్లాక్ టికెట్స్‌ను అమ్ముతున్నారట. ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఆయన తుంగలో తొక్కి… సాధారణ ప్రేక్షకులు థియేటర్స్ రాకుండా చేస్తున్నారు.

10 థియేటర్స్ నుంచే కోటి ?

హైదరాబాద్‌లో పేరు మోసిన 10 సింగిల్ స్క్రీన్స్‌లో 800 రూపాయలు ఉండాల్సిన టికెట్ ధరను 2000 రూపాయల చొప్పున అమ్మేశారట. దీని వల్ల  దాదాపు 1 కోటి వరకు డబ్బులు వచ్చాయంట. అంటే సాధారణం కంటే, దాదాపు రెండున్నర ఇంతలు లాభాలు వచ్చాయి అన్నట్టు.

సింగిల్స్ థియేటర్స్ తర్వాతే మల్టీప్లెక్స్?

సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బుకింగ్స్ ఇప్పుడు ఓపెన్ చేశారు. నిజానికి ఇదే టైంలో మల్టీప్లెక్స్ ఓపెన్ చేయాలి. కానీ, మల్టీప్లెక్స్ కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తే ఈ బ్లాక్ దందా అనుకున్నట్టు వర్క్ అవుట్ అవ్వదు. అందు వల్ల… మొదట సింగిల్స్ థియేటర్స్‌ బుకింగ్స్ మాత్రమే ఓపెన్ చేశారట. ఆ… టికెట్స్ అన్నీ.. ఆ బ్లాక్ టికెట్స్ అన్నీ అమ్ముడుపోయిన తర్వాతే… మల్టీప్లెక్స్‌లో బుకింగ్స్ ఓపెన్ అవ్వబోతున్నాయట.

రక్షకులు కాస్త భక్షకులు అయిన టైం…

అసలే ఇప్పుడు ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది. ఇప్పుడు జనాలు థియేటర్స్ కి అడుగు పెట్టాలి. సినిమాలు హిట్ అవ్వాలి. అలా చూసుకోవాల్సిన బాధ్యత మన డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలపైనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే, అలా జరిగితేనే ఇండస్ట్రీ బాగుపడి, వాళ్లకు డబ్బులు వస్తాయి. కానీ, ఈ రక్షకులు ఇప్పుడు బ్లాక్ దందాలోకి దిగి భక్షకులగా మారి ఇండస్ట్రీని చంపే ప్రయత్నం చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.

అంతా బడా నిర్మాత కక్కుర్తి ?

ఈ బ్లాక్ దందాపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి అభిమానులను సినిమాకు దూరం చేస్తున్నాడు అంటూ ఫైర్ అవుతున్నారు.

Related News

MSG Movie: అది చిరు రేంజ్.. అప్పుడే ఉత్తరాంధ్ర థియేట్రికల్‌ రైట్స్‌ క్లోజ్, ఎవరు తీసుకున్నారంటే!

Jyothi Poorvaj: ఓర్నీ.. మన జగతీ ఆంటీ కూడా పవన్ ఫ్యానేరా.. ఎంత హాట్ గా ప్రమోట్ చేస్తుందో

Manchu Manoj: మనోజ్ క్యారెక్టర్ ఆ స్టార్ హీరో చేస్తే మిరాయ్ హిట్ అయ్యేదా.. ?

OG Movie: మిరాయ్ థియేటర్లు ఓజీకి.. పవన్ భయపెట్టాడా.. ?

OG Movie: ఉండే గంటకు అంత హైప్ ఎందుకురా బుజ్జి..

Tollywood:కిస్ పెడుతూ… ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పబ్‌లో అడ్డంగా దొరికిపోయిన బేబీ హీరో

OG: స్టైల్ కాపీ ఓకే.. రిజల్ట్ కూడా అలాగే ఉంటే.. చెక్కేయడమే!

Big Stories

×