Flipkart Budget Phones| ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సెప్టెంబర్ 23, 2025 నుంచి మొదలైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్‌లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్స్, అప్లయన్స్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ కార్డ్‌లతో పేమెంట్ చేస్తే 10 శాతం తగ్గింపు పొందవచ్చు. ₹20,000 బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కొనాలనుకుంటే, ఫ్లిప్‌కార్ట్ డీల్స్ మంచి అవకాశం. ఈ డీల్స్ మిస్ చేసుకోకండి.
బిగ్ బిలియన్ డేస్ షాపింగ్
బిగ్ బిలియన్ డేస్ సేల్ లో పాపులర్ ఐటమ్స్ త్వరగా అయిపోతాయి. బ్యాంక్ కార్డ్స్‌తో డిస్కౌంట్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మీ పాత ఫోన్‌ని మార్చుకోవచ్చు. నో-కాస్ట్ EMIతో చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు. ఈ సేల్ లో ఎక్కువగా అమ్ముడుపోయే ఐటెమ్స్ స్మార్ట్ ఫోన్లు. వీటిలో కూడా మిడ్ రేంజ్ ఫోన్లదే హవా. అందుకే ₹20,000 బడ్జెట్ లో ఏ స్మార్ ఫోన్ కొనుగోలు చేయాలి.. అని నిర్ణయించేందుకు బెస్ట్ ఫోన్స్, వాటిపై లభిస్తున్న డీల్స్ ఒకసారి చూద్దాం.
ఒప్పో K13 5జీ (Oppo K13 5G) డీల్
Oppo K13 5G (8GB/128GB) ధర రూ. 17,999. ICICI డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 2,000 డిస్కౌంట్ ఉంది. చివరి ధర రూ. 15,999! 6.67-ఇంచ్ 120Hz FHD+ డిస్‌ప్లే బ్రైట్, క్రిస్ప్. Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ స్మూత్‌గా పని చేస్తుంది. 7000mAh బ్యాటరీ రెండు-మూడు రోజులు ఉంటుంది. 80W SuperVOOC ఛార్జింగ్ సూపర్ స్పీడ్ తో ఛార్జ్ చేస్తుంది. డైలీ యూజ్, గేమింగ్‌కు సూపర్.
పోకో X7 Pro 5జీ (Poco X7 Pro 5G)
Poco X7 Pro 5G ధర రూ. 19,999. క్రెడిట్/డెబిట్ కార్డ్‌తో బ్యాంక్ ఆఫర్ రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది. 6.67-ఇంచ్ AMOLED డిస్‌ప్లే, 2712×1220 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఇస్తుంది. MediaTek Dimensity 8400 Ultra ప్రాసెసర్ గేమ్స్ సపోర్ట్ చేస్తుంది. HyperOS 2.0 (Android 15) మీద రన్. 6550mAh బ్యాటరీ, 90W హైపర్‌ఛార్జ్ చేస్తుంది. గేమర్లకు ఇదే బెస్ట్ చాయిస్.
సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో (CMF Phone 2 Pro)
CMF Phone 2 Pro (8GB/128GB) ధర రూ. 14,999 (లాంచ్ ధర రూ. 15,999 నుంచి తగ్గింపు). 6.77-ఇంచ్ FHD+ AMOLED డిస్‌ప్లే బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఇందులోని Octa-core MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్.. రెస్పాన్సివ్ వర్క్, గేమింగ్ కు స్పీడ్ ఇస్తుంది. ఇది Nothing OS 3.2 (Android 15) మీద రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జ్ చేస్తుంది. మల్టీటాస్కింగ్ చేసే వారికి ఇది గొప్ప ఆప్షన్.
రియల్‌మి P4 Pro 5జీ (Realme P4 Pro 5G)
Realme P4 Pro 5G ధర రూ. 19,999 (దీని లాంచ్ ధర రూ. 22,999). అంటే ఏకంగా రూ.10000 డిస్కౌంట్. ఇందులో బ్యాంక్ ఆఫర్ రూ. 3,000. ఈ ఫోన్‌లో 6.8-ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 1280×2800 రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ తో మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. Octa-core Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో స్పీడీ ప్రాసెసింగ్. 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. AI కెమెరాలు, గేమింగ్‌కు హైపర్ విజన్ చిప్, స్లిమ్ డిజైన్, లైట్‌వెయిట్ వంటి అద్భుత ఫీచర్లున్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (Motorola Edge 60 Fusion)
Motorola Edge 60 Fusion (8GB/256GB) ధర రూ. 19,499 (దీని లాంచ్ ధర రూ. 22,999). ఇందులో బ్యాంక్ ఆఫర్ రూ. 1,500. ఈ ఫోన్ 6.7-ఇంచ్ డిస్‌ప్లే, 1220×2712 రిజల్యూషన్ తో వస్తుంది. దీని ఫీచర్లు విషయానికి వస్తే.. MediaTek Dimensity 7400 ప్రాసెసర్, 5500mAh బ్యాటరీ, 68W టర్బో ఛార్జింగ్ ఉన్నాయి. క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, మోటో AI, 50MP కెమెరా. ప్రీమియం బిల్డ్, డ్యూరబిలిటీలో ఈ ఫోన్ మిగతా ఫోన్ల కంటే టాప్ ఛాయిస్.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు 5G స్పీడ్, భారీ బ్యాటరీలు అందిస్తాయి. డిస్‌ప్లే వీడియోలు, గేమ్స్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది. ప్రాసెసర్లతో డైలీ యాప్‌లు మంచిగా రన్ చేస్తాయి. బ్యాంక్ ఆఫర్లు ఆకర్షణీయం చేస్తాయి. మీ అవసరాలకు తగినట్లు పోల్చి కొనుగోలు చేయండి. ఫ్లిప్‌కార్ట్ సేఫ్, సెక్యూర్ ప్లాట్ ఫామ్. స్టాక్ అయిపోకముందే కొనండి! ఈ ఫెస్టివ్ సీజన్ స్మార్ట్‌గా అప్‌గ్రేడ్ చేయండి.
Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గీలో ఎక్కువ డిస్కౌంట్ కావాలా? ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే సరి