OG Movie – Sujeeth: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం దర్శకుడు సుజిత్(Sujeeth) పేరు బాగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈయన సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం నాని హీరోగా మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే సుదీర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమా(OG Movie) ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ అలాగే ప్రీక్వెల్ సినిమాలు కూడా రాబోతున్నాయని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో అభిమానులదరూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా మంచి విజయం అందుకొని లాభాలను తీసుకున్నారంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని, తెరవెనుక నిర్మాతకు, డైరెక్టర్ సుజిత్ మధ్య గొడవలు ఉన్నాయి అంటూ వార్తలు బయటకు వచ్చాయి.. ఈ సినిమా కోసం నిర్మాత దానయ్య (Danayya)నుంచి సుజిత్ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టించారని ఇలా బడ్జెట్ విషయంలోనే విభేదాలు రావడంతో ఓజి యూనివర్స్ నుంచి వచ్చే తదుపరి సినిమాలకు దానయ్య నిర్మాతగా వ్యవహరించడం లేదనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇలా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు కారణంగానే దానయ్య ఈ సినిమాల నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై దర్శకుడు సుజిత్ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ.. ఓజి సినిమా గురించి చాలామంది ఎన్నో విధాలుగా అనుకుంటున్నారు. అయితే ఒక సినిమా మొదలైనప్పటి నుంచి ఆ సినిమాని చివరి వరకు తీసుకెళ్లడానికి ఏది అవసరమనే విషయాలు చాలా మందికి తెలియవు. ఓజి సినిమా విషయంలో నిర్మాత దానయ్య అలాగే ఇతర చిత్ర బృందం మాపై పెట్టిన నమ్మకాన్ని మాటల్లో చెప్పలేమని అదే నేడు ఈ సినిమాకి ఎంతో బలాన్ని ఇచ్చిందని తెలిపారు.
https://twitter.com/Sujeethsign/status/1980543166131675477/photo/1
పవన్ కళ్యాణ్ ఓజి సినిమా విషయంలో అభిమానులు చూపించిన, ప్రేమ ఈ సినిమాకు ఒక అర్థాన్ని ఇచ్చిందని, ఈ విషయంలో దానయ్య గారు మాపై చూపించిన మద్దతుకు ఆయన నమ్మకానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ సుజిత్ ఈ సందర్భంగా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవ్వడమే కాకుండా నిర్మాతతో గొడవల గురించి కూడా క్లారిటీ వచ్చినట్టు అయింది. ఇలా దానయ్య సుజిత్ మధ్య గొడవలు అంటూ వచ్చిన ఈ వార్తలకు ఇంతటితో పులిస్టాప్ పెట్టినట్టు అయింది. ఇక ఈ వార్తలలో నిజం లేదని తెలియడంతో ఓజి యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు దానయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్నారని స్పష్టమవుతుంది. సుజిత్ నాని కాంబినేషన్లో సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఓజి సీక్వెల్ పనులు ప్రారంభం కాబోతున్నాయని వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.