Telangana Man Dath: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (32) అనే యువకుడు సౌత్ ఆఫ్రికాలో చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. బతుకుదెరువు కోసం సౌతాఫ్రికా దేశానికి వెళ్లిన శ్రీనివాస్.. బోరింగ్ డ్రిల్లర్, డ్రైవర్‌గా పని చేసేవాడు.. అయితే ఆ యువకుడు నివాసం ఉండే ఇంటి వెనకాల చెట్టుకు ఉరి వేసుకొని శవమై కనిపించాడు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే కుటుంబ సభ్యులు మాత్రం దీంతో తెలంగాణలోని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తమ కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, మృతునికి భార్య నవిత, కూతురు లాస్య, కొడుకు నిహాల్ ఉన్నారు.
శ్రీనివాస్ మృతి వెనుక అసలు కారణం ఏమిటి అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతనిది ఆత్మహత్య లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read: ప్రపంచంలోనే అత్యంత బరువైన గోల్డ్ డ్రెస్.. దీని ఖరీదు ఎంతంటే..
శ్రీనివాస్ మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అక్కడి నుంచి మృతదేహం స్వదేశానికి రావడానికి మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.