Sukumar: కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ కాకపోయినా కూడా వాటికంటూ ఒక స్థానం ఉంటుంది. రిలీజ్ అయిన టైం కి ఆ సినిమాలు హిట్ కాకపోయినా కొన్ని రోజులు తర్వాత ఆ సినిమాలు క్లాసిక్ లా అనిపిస్తాయి. అలాంటి సినిమాల ప్రస్తావని వస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహేష్ బాబు ని రాక్ స్టార్ గా చూపించి సక్సెస్ అయ్యాడు సుకుమార్. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఫలితం మాత్రం ఎవరు ఊహించలేదు. భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నాన్నకు ప్రేమతో అనే సినిమా చేశారు సుకుమార్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు వచ్చినా కూడా.. రంగస్థలం అంటేనే సుకుమార్ బెస్ట్ వర్క్ అని చాలామంది నమ్ముతారు.
మీరు లేకపోతే నాకు సినిమా లేదు
రీసెంట్ గా నార్త్ అమెరికా తానా సభలకు చాలామంది తెలుగు సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో సుకుమార్ ఒకరు. ఈ తానా సభలలో సుకుమార్ మాట్లాడుతూ నార్త్ లో ఉన్న తెలుగు ప్రేక్షకులను తన కృతజ్ఞతలు తెలిపారు. నేనొక్కడినే సినిమా కేవలం మీరు చూడడం బట్టే నాకు ఇంకో అవకాశం వచ్చింది. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని సుకుమార్ ఎమోషనల్ అయ్యారు.
మరో విషయానికి కృతజ్ఞతలు
మా నవీన్ గారిని కూడా తెలుగు సినిమాకి ప్రొడ్యూసర్ గా ఇచ్చినందుకు అమెరికాకు కృతజ్ఞతలు. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఎన్ని సినిమాలను క్రియేట్ చేశారు. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. అలానే ఆర్య సినిమా చిత్ర యూనిట్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అంటూ సుకుమార్ తెలిపారు.
మైత్రి మేకర్స్ లోనే వరుస సినిమాలు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. ఈ బ్యానర్ లో ఎంతమంది సినిమాలు చేసినా కూడా సుకుమార్ ప్రత్యేకమైన చెప్పాలి. వరుసగా సుకుమార్ ప్రస్తుతం ఈ బ్యానర్ లోనే సినిమాలు చేస్తున్నారు. పుష్ప సినిమాతో ఈ బ్యానర్ కి కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో చాలా పెద్ద సినిమాలు నిర్మితమవుతున్నాయి.
Also Read : Megastar Chiranjeevi: చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన కూల్ డ్రింక్ ని బ్యాన్ చేశారు