Pallavi Prashanth: యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ బిగ్ బాస్(Bigg Boss) అవకాశాన్ని అందుకున్న వారిలో పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) కూడా ఒకరు. తాను రైతు బిడ్డనని, వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నామని , నాలాంటి వ్యక్తికి బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వాలి అంటూ వేడుకున్నారు. అయితే ఈయన కోరుకున్న విధంగానే బిగ్ బాస్ కార్యక్రమంలో ఛాన్స్ దక్కించుకున్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెంట్ గా పాల్గొన్న పల్లవి ప్రశాంత్ విన్నర్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
విన్నర్ పై పోలీస్ కేస్..
ఈ కార్యక్రమంలోకి ఒక సామాన్యుడిగా అడుగుపెట్టి విజేతగా బయటకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక పల్లవి ప్రశాంత్ బయటకు రావడంతోనే పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్నారు. ఈయన అభిమానులు అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా ప్రభుత్వ, ప్రవేట్ ఆస్తులను ద్వంశం చేయడంతో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు అయింది. దీంతో పోలీసులు తనని అరెస్టు చేసి దాదాపు నాలుగు రోజులపాటు జైలులో పెట్టారు. బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ తిరిగి యధావిధిగా వ్యవసాయ పనులు చేసుకుంటూనే మరోవైపు ఎన్నో షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
బౌన్సర్లను నేను పెట్టుకోలేదు..
ఇక పల్లవి ప్రశాంత్ ఏదైనా ఒక కార్యక్రమానికి వస్తున్నారు అంటే పెద్ద ఎత్తున బౌన్సర్లను (Bouncers) కూడా ఏర్పాటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా పల్లవి ప్రశాంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయనకు జైలు జీవితం గురించి అలాగే బౌన్సర్లను పెట్టుకోవడం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. తాను బయటకు వచ్చిన తర్వాత బౌన్సర్లను పెట్టుకున్నాను అన్నది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. నేను ఏదైనా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్తున్నాను అంటే ఆ షాప్ వాళ్ళు ఏర్పాటు చేశారు తప్ప నేను ఎవరిని పెట్టుకోలేదని, బౌన్సర్లు పెట్టుకొనేంత నేనేమీ సాధించలేదని క్లారిటీ ఇచ్చారు.
జైలుకు… ఆస్పత్రికి వెళ్ళకూడదు..
జైలు జీవితం గురించి కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జైలుకి, ఆసుపత్రికి వెళ్ళకూడదు అంటారు కానీ జైలుకు వెళ్తే జీవితం విలువ ఏదో తెలుస్తుందని తెలిపారు. నేను కూడా ఆ నాలుగు రోజుల జైలు జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికి కూడా కేసు అలాగే కొనసాగుతుందని ప్రతినెలా ఒకటో తేదీ 15వ తేదీ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టి రావాలని, ఈ కేసు చివరి దశకు వచ్చింది అంటూ పల్లవి ప్రశాంత్ ఈ సందర్భంగా తన జైలు జీవితం గురించి కూడా తెలియజేశారు.
Also Read: Pallavi Prashanth: బిగ్ బాస్ డబ్బులు పంచేసాను… యూటర్న్ తీసుకున్న రైతుబిడ్డ!