Sundarakanda: ఏ పుట్టలో ఏ పాము ఉందో చెప్పడం ఎంత కష్టమో.. ఏ సినిమా కథ ప్రేక్షకులకు నచ్చుతుందో చెప్పడం కూడా అంతే కష్టం. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారో ఎవరికి తెలియడం లేదు. పెద్ద పెద్ద సెట్ లు, భారీ భారీ కథలు, స్టార్ హీరోలు అయినాకూడా ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. సింపుల్ గా వాస్తవాలకు దగ్గరగా ఉన్న కథలను మెచ్చుతున్నారు. నేడు రిలీజ్ అయిన సుందరాకాండ కూడా ఆ కోవకే చెందుతుంది అని చెప్పుకొస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా నారా రోహిత్ ఒక మంచి హిట్ కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటించిన ఈ హీరో కొంత గ్యాప్ తీసుకొని ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే సుందరకాండ. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోహిత్ సరసన సీనియర్ హీరోయిన్ శ్రీదేవి, వృతి వాఘాని నటించారు. మొదటి నుంచి ఈ సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ వర్క్ అవుట్ అవుతుందనే చెప్పుకొచ్చారు. అనుకున్నట్లే సినిమా మంచి వినోదంతో పాటు ఫీల్ గుడ్ మూవీని చూసిన అనుభూతిని ఇచ్చినట్లు ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు.
స్టోరీ రొటీన్ అయినా డైరెక్టర్ చూపించిన తీరు బావుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. రెండు లవ్ స్టోరీస్ కూడా ఫస్ట్ హాఫ్ లోనే చూపించడం కొత్తగా ఉందని, ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ స్టోరీస్ రావడమే అరుదు.. అలాంటిది ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ స్టోరీ రాయడం నిజంగా గ్రేట్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సత్య కామెడీ సినిమాకు హైలైట్ అని రోహిత్ నటన చాలా బావుందని అంటున్నారు.
కథ విషయానికొస్తే ఇలాంటి లవ్ స్టోరీస్ చాలా సినిమాల్లో చూశామని, కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బావుందని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. మౌత్ టాక్ మంచిగా వచ్చి కలక్షన్స్ కూడా వస్తే నారా రోహిత్ హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు. చాలా కాలం తరువాత ఈ కుర్ర హీరో మంచి విజయాన్ని అందుకున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.