BigTV English

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

Trump’s Tariff War: అమెరికా ఫస్ట్ అంటూ రెచ్చిపోతున్న ట్రంప్ కు.. కాళ్ల కింద నీళ్లు వచ్చేదాకా తెలియడం లేదా? టారిఫ్ లు అంటూ, అమెరికన్లనే ఉద్యోగులుగా పెట్టుకోవాలని, విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు.. ఒక్కటేమిటి అన్నీ చేస్తున్నాడు ట్రండ్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ స్లోగన్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. మనోళ్లు లేకుండా అమెరికా నడుస్తుందా అని గుర్తించలేకపోతున్నారా? సిలికాన్ వ్యాలీ టూ వాల్ స్ట్రీట్ దాకా మనోళ్లు లేకుండా మనుగడ సాగిస్తారా?


మనపై 50 శాతం టారిఫ్‌లతో ట్రంప్ ఖుషీ

మనపై ట్రంప్ టారిఫ్ బాంబ్ డ్రాప్ చేసేశారు. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆగస్ట్ 27న ఉదయం 10 గంటల నుంచి 50శాతం సుంకాలు అమలులోకి వస్తాయి. అమెరికాలోకి ప్రవేశించే ఇండియన్ ప్రొడక్ట్స్ పై 50 శాతం టారిఫ్‌లు వర్తించబోతున్నాయ్. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ భారత్ కు నోటీసులు ఇచ్చింది కూడా. ఆగస్ట్ 7 నుంచే మనపై 25 శాతం టారిఫ్స్ వేశారు. ఇప్పుడు మరో 25 శాతం అదనపు బాదుడు అన్న మాట. ఇండియా వస్త్ర పరిశ్రమ, ఆక్వా ఇండస్ట్రీ, తోలు ఉత్పత్తులపై వెంటనే తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ డోంట్ కేర్ అంటున్నారు. ఎవరొచ్చినా ఇండియాను చెడుగుడు ఆడుకుంటామంటున్నాడు. రష్యాతో వ్యాపారం చేసే ఇతర దేశాలపై ఇంతలా టారిఫ్ లు విధించలేని ట్రంప్.. కేవలం మనల్నే టార్గెట్ చేయడం వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే అవి వ్యక్తిగత కారణాలు, రాజకీయ కారణాలే. ఫైనల్ గా మనల్ని టార్గెట్ చేస్తే నష్టపోయేది అమెరికానే అన్న సంగతి మర్చిపోతున్నట్లుంది సీన్.


తక్కువ వచ్చిన చోటే కొంటామని భారత్ కౌంటర్

మనం రష్యా నుంచి ఆయిల్, ఆయుధాలు కొంటున్నామన్న అక్కసుతో ట్రంప్ భారత్ పై 50 శాతం టారిఫ్ బాంబ్ వేశాడు. అయితే ట్రంప్ చర్యలతో భారత్ డీలా పడిపోలేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకునేందుకు రెడీ అంటోంది. చమురు ఎక్కడ తక్కువకు వస్తే అక్కడే కొంటామని ధీటుగా బదులిచ్చింది. అంతే కాదు.. అమెరికాకు పోస్టల్ సర్వీస్ లనూ తపాలా శాఖ నిలిపేసింది. నువ్ యాక్షన్ ఇస్తే.. మేం రియాక్షన్ ఇస్తాం.. తగ్గేదే లేదంటోంది. దేనికైనా సిద్ధమే అని భారత్ సవాల్ చేస్తోంది. మంచికి మంచి.. చెడుకు చెడు.. ఇదే మన పాలసీ. గీత దాటితే ఎవడైనా ఒకటే. అది ట్రంప్ అయినా.. ఆసిమ్ మునీర్ అయినా. అందుకే ట్రంప్ కు గట్టిగానే సమాధానాలు వెళ్తున్నాయ్. ఎంత వరకు వెళ్తాడో చూస్తోంది భారత్.

ట్రంప్ ఏదో అనుకుంటే ఇంకోదే జరుగుతోందా?

మరోవైపు కాళ్ల కిందికి నీళ్లు వస్తున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఫర్నిచర్‌ దిగుమతులపై సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికాలోకి వచ్చే ఫర్నిచర్‌పై తాము భారీస్థాయిలో టారిఫ్ ఇన్వెస్టిగేషన్‌ నిర్వహిస్తున్నామన్నారు. 50 రోజుల్లో ఆ విచారణ పూర్తవుతుందని ఆ తర్వాత కథ మారుస్తామన్నారు. నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినా, మిషిగన్‌కు తిరిగి ఫర్నీచర్ ఇండస్ట్రీని తీసుకురావడమే టార్గెట్ అంటున్నారు. రైట్ అంతా బాగుంది.. ట్రంప్ ఏదో అనుకుంటున్నారు.. ఏదో చేద్దామనుకుంటున్నారు.. అమెరికా ఫస్ట్ అంటున్నారు. తప్పు లేదు. ఎవరి దేశం వారికి గ్రేట్. కానీ ఎవరిపైనో కోపం ఇంకెవరిపైనో చూయిస్తేనే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో ఆ దేశానికి ఎంత నష్టమో ఇప్పుడు చూద్దాం.

భారతీయ నిపుణులు లేకుండా అమెరికా ఒక్క అడుగు కూడా వేయదు. ఇది జగమెరిగిన సత్యం. మనోళ్లు మంచి అవకాశాల కోసం అక్కడికి వెళ్లడం, చదువుకోవడం, అక్కడే ఉద్యోగాలు సాధించడం వరకూ ఇదొక రెగ్యులర్ సైకిల్ గా మారింది. చెప్పాలంటే అమెరికా ప్రతి రంగంలో మనోళ్లు బలంగా నాటుకుపోయారు. శాసించే స్థితిలో ఉన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా టాప్ US కంపెనీల సీఈవోలూ మనోళ్లే. అమెరికా వద్దంటే మనోళ్లను కళ్లకద్దుకుని రా రమ్మనే దేశాలు చాలానే ఉన్నాయి. మరి ఏంటి ట్రంప్ ధైర్యం? మన నిపుణుల్ని రానివ్వకపోతే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయమేనా? అమెరికాను ట్రంప్ గ్రేట్ చేస్తున్నాడా లేదంటే.. దివాళా తీయించే పనులు చేస్తున్నాడా?

టాప్ కంపెనీలకు సీఈవోలు ఇండియన్లే..

సిలికాన్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ ఇలా ఇండియన్ సీఈఓలు ప్రముఖ సంస్థలను నడిపిస్తున్నారు. ఫార్చ్యూన్ టాప్ 500 కంపెనీలలో 10 శాతం కంటే ఎక్కువ మంది సీఈఓలు భారతీయ సంతతికి చెందినవారే. వీరంతా కలిసి 6.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను నిర్వహిస్తున్నారంటే మాటలు కాదు. ఇదంతా ఎలా సాధ్యపడుతోందంటే… భారతీయ సీఈఓలు తమ కేపబిలిటీ, స్టెబిలిటీ, రిస్క్ టేకింగ్, రిస్క్ అసెస్ మెంట్, డిసిజన్ మేకింగ్ కెపాసిటీలతో అమెరికన్ కంపెనీలను ప్రపంచ స్థాయిలో నడిపిస్తున్నారు. వీరి హెల్ప్ లేకుండా అమెరికా గ్లోబల్ టెక్, ఫైనాన్స్ రంగాల్లో తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది ట్రంప్ కు అర్థం కావట్లేదా?

H1-B వీసాల్లో గతేడాది 70 శాతం మనోళ్లకే

భారతీయ నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ, వాల్ స్ట్రీట్, అలాగే US హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి సహకారం లేకుండా అమెరికా ఆర్థిక, సాంకేతిక, ఆరోగ్య రంగాలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనే ముప్పు ముంగిట్లోనే ఉంది. భారతీయ నిపుణులు, ముఖ్యంగా H-1B వీసాలతో కీలక రంగాల్లో ఉన్నారు. 2024లో H-1B వీసాల్లో దాదాపు 70-78% ఇండియన్లకే మంజూరయ్యాయి. ఈ వీసాలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్‌సెక్యూరిటీ వంటి రంగాల్లో స్కిల్స్ ఉన్న వారికి వచ్చాయి. ఇవే కాదు.. భారతీయ టెక్ కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో 198 బిలియన్ డాలర్లను జోడించి 16 లక్షల ఉద్యోగ కల్పనలో కీలకం అయ్యాయి. ఇది అమెరికాలోని 20 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల కంటే పెద్దది.

డేటా సైంటిస్ట్‌లుగా, ఫైనాన్షియల్ ఇంజనీర్లుగా కీ రోల్స్

ఇండియన్ ఎక్స్ పర్ట్స్.. వాల్ స్ట్రీట్‌లో క్వాంటిటేటివ్ అనలిస్ట్‌లుగా, డేటా సైంటిస్ట్‌లుగా, ఫైనాన్షియల్ ఇంజనీర్లుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరికి రిమోట్ రిస్క్ మోడలింగ్, ట్రేడింగ్ అల్గారిథమ్‌లు, డేటా అనలిటిక్స్‌లో స్కిల్స్ ఉన్నాయి. ఒకప్పుడు మాస్టర్ కార్డ్ సీఈవోగా ఉన్న అజయ్ బంగా.. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇళాంటి వాళ్లంతా ఆర్థిక రంగంలో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. చెప్పాలంటే అమెరికన్ ఆర్థిక సంస్థల్లో డేటా అనలిటిక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఫిన్‌టెక్ ఇన్నోవేషన్స్ లో మనోళ్లే ముందంజలో ఉన్నారు. వారు అల్గారిథమిక్ ట్రేడింగ్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్‌లో స్కిల్స్ తో ఫైనాన్షియల్ గా కీలక నిర్ణయాలు తీసుకుంటూ, గ్లోబల్ మార్కెట్‌లలో అమెరికా ఆధిపత్యం తగ్గకుండా నిలబెట్టడంలో భారతీయులే కీలకంగా ఉన్నారు. ఈ విషయం కూడా ట్రంప్ కు తెలుసు. అయినా సరే తగ్గితే ఆధిపత్యం పడిపోతుందన్న భయమా మరొకటా తెలియదు గానీ పైకి మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

US 20% యూనికార్న్ కంపెనీలు నడిపించేది మనోళ్లే

అటు భారతీయ నిపుణులు సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, రీసెర్చర్‌లుగా Google, Apple, Meta, Nvidia వంటి సంస్థల్లో కీ రోల్స్ లో ఉన్నారు. సిలికాన్ వ్యాలీలోని టెక్ ఉద్యోగులలో దాదాపు మూడింట ఒక వంతు మంది భారతీయ సంతతి వారే. అమెరికాలో 20 శాతం యూనికార్న్ కంపెనీలను మనదేశం నుంచి వెళ్లినోళ్లే నడిపిస్తున్నారు. ఇక అమెరికా హెల్త్ సెక్టార్ గురించి చూద్దాం. ఇక్కడ కూడా మనోళ్లు ఎక్కడా తక్కువ లేరు. అమెరికాలోని డాక్టర్లలో ఐదో వంతు అంటే 20 శాతం ఇండియన్ డాక్టర్లే ఉన్నారు. రిజిస్టర్డ్ నర్సులలో రెండవ అతిపెద్ద గ్రూప్ NRI నర్సులదే. అమెరికాలోని రూరల్ ఏరియాస్ లో అలాగే వైద్య సేవలు అందని చోట్ల కూడా మనోళ్లు కీలకంగా పని చేస్తున్నారు. మనోళ్ల పాత్రే కీలకం. అమెరికన్ నర్సులు, అమెరికన్ డాక్టర్లు చాలా వరకు పెద్ద సిటీలకే పరిమితమవుతున్నారు. భారత సంతతి డాక్టర్ ఒకరు నార్త్ కరోలినాలో 15 ఏళ్ల పాటు ఏకైక ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేశారని కొందరు గుర్తు చేస్తున్నారు. అంటే అమెరికన్లు మన డాక్టర్లపై ఎంతగా ఆధారపడ్డారో అర్థం చేసుకోవచ్చు. భారతీయ వైద్య నిపుణులు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్, బయోటెక్నాలజీలో కూడా కీరోల్స్ పోషిస్తున్నారు.

వరల్డ్ సెంట్రల్ బ్యాంకింగ్ గ్రూప్ కీ మీటింగ్

ఇటీవలే వరల్డ్ సెంట్రల్ బ్యాంకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఓ కీలక మీటింగ్ జరిగింది. దీనికి అభివృద్ధి చెందిన దేశాల నుంచి బ్యాంకింగ్, ఆర్థిక నిపుణులు వచ్చారు. అక్కడ అంతా ముక్తకంఠంతో చెప్పిన మాటేంటో తెలుసా.. వలస కార్మికులు, విదేశీ నిపుణులు లేకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగదు. రాబోయే రోజుల్లో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. అంటే మనోళ్ల పవర్ అమెరికాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో ఎగ్జాంపుల్ చూద్దాం.. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ – CBO – 2025 రిపోర్ట్ ప్రకారం, అమెరికాకు తగినంత వలసలు లేకపోతే, రాకపోతే.. జనాభా 2033 నాటికి తగ్గుముఖం పడుతుందని, ఇది వర్క్ ఫోర్స్ ను డౌన్ చేస్తుందని, సోషల్ సెక్యూరిటీ ఇష్యూస్ పై ఎఫెక్ట్ చూపిస్తోందని తెలిపింది. అంతేకాదు రాబోయే 30 ఏళ్లల్లో అమెరికా ఆర్థిక వృద్ధిరేటు 2.5% నుంచి 1.6%కి తగ్గుతుందని అంచనా వేసింది కూడా. సో ఇది అమెరికాకు సివియర్ డేంజర్ బెల్ అన్న మాట.

US కంపెనీలు విదేశాలకు తరలే ఛాన్స్

సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, AI, ఆరోగ్య రంగంలో నైపుణ్యం ఉండే వారి సంఖ్య తగ్గితే ఆటోమేటిక్ గా మళ్లీ మైగ్రంట్స్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి అమెరికాది. అమెరికన్లతో ఈ కొరత అధిగమించడం హైయ్ లీ ఇంపాజిబుల్. ఇండియన్ ఎక్స్ పర్ట్స్.. టెక్, ఫైనాన్స్, అండ్ హెల్త్ సెక్టార్లలో ఇన్నోవేషన్స్, అలాగే ప్రొడక్టివిటీని పెంచుతున్నారు. వీరు లేకపోతే ఇవే అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను కెనడా, యూరప్ వంటి ఇతర దేశాలకు మార్చుకునే ఛాన్స్ ఉంది. సో సొంత దేశపు కంపెనీలే తరలిపోతే.. అది ఫైనల్ గా అమెరికా ఆర్థిక వ్యవస్థకే హాని చేయడం ఖాయం. ఇండియా కూడా స్వయంగా టెక్ హబ్‌గా ఎదుగుతోంది. దీంతో అమెరికా లాంటి దేశాల నుంచి తిరిగి వచ్చే మన దేశపు నిపుణులతో భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.

Also Read: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

మరో విషయం.. అమెరికా మనోళ్లను కాదనుకుంటే.. ప్రపంచం వట్టిపోలేదు. గ్లోబల్ కాంపిటీషన్ బాగానే ఉంది. కెనడా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈజీ వలస విధానాలతో నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ ను ఆకర్షిస్తున్నాయి. అమెరికా వలస విధానాలను కఠినం చేస్తే వీళ్లంతా ఇతర దేశాలకు మళ్లుతారు. ఇది అమెరికాకే నష్టం తప్ప మరొకటి కాదు. ఇప్పటికే H-1B వీసా విధానాలను టైట్ చేశాడు ట్రంప్. ఇప్పటికిప్పుడు మనోళ్లపై ఇది ఎఫెక్ట్ చూపినా రాబోయే రోజుల్లో అమెరికాకే నష్టం. సో ఈ లెక్కలన్నీ చూస్తే ట్రంప్ కు జ్ఞానోదయం వెంటనే కావాలి. కానీ అలా జరగట్లేదు. ఇదంతా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే ట్రంప్ చూసుకుంటున్నారు. దీర్ఘకాలంలో అమెరికాకు ఏమైనా పర్వాలేదు అన్న ఆలోచనతోనే ఉన్నారా? మరి అమెరికాను ఎవరు కాపాడాలి??

Story By Vidya Sagar, Bigtv

Related News

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

Big Stories

×