Bahubali The Epic: ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత సినిమాలను తిరిగి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రీ రిలీజ్(Re Release) సినిమాలకు కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ నెలలో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన పలు సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాహుబలి (Bahubali)రెండు సినిమాలు కలిపి ఒకే భాగముగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) పేరిట విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
బాహుబలి సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన రాజమౌళి(Rajamouli) ఈ సినిమా కథలో ఎలాంటి మార్పులు లేకుండా ఈ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా రెండు భాగాలు ఒకే సినిమాగా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసిన అనంతరం ఈ సినిమాకు 3:45 నిమిషాల రన్ టైం లాక్ చేశారు. అదేవిధంగా ఈ సినిమాకు U/A 16+సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రన్ టైం కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. అయితే ఇందులో కొన్ని పాటలను తొలగించినట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని కొత్త సన్నివేశాలను కూడా యాడ్ చేసినట్లు చిత్ర బృందం ఇటీవల వెల్లడించారు. బాహుబలి ది ఎపిక్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను కూడా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది.
రీ రిలీజ్ లో సరికొత్త రికార్డు..
ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ ఇలా రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ జక్కన్న రీ రిలీజ్ విషయంలో కూడా సరికొత్త ట్రెండ్ సృష్టించారనే చెప్పాలి. ఇప్పటికే యూఎస్ మార్కెట్ లో బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఈ సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆల్రెడీ లక్ష డాలర్స్ గ్రాస్ దగ్గరకి సినిమా దూసుకెళ్తుంది. ఇలా రీ రిలీజ్ విషయంలో కూడా బాహుబలి ది ఎపిక్ సరికొత్త రికార్డులను సృష్టించబోతుందని తెలుస్తోంది.
Also Read: Bandla Ganesh: అది పీకుతా.. ఇది పీకుతా అని చెప్పాల్సిన పనిలేదు.. నిర్మాతకు బండ్లన్న కౌంటర్