NC24 Movie : టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్య, విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. NC24 పేరుతో ఆ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. తండేల్ మూవీ తర్వాత నాగచైతన్య చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే ఈ మూవీ నుంచి తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న NC24 మూవీ నుంచి తాజాగా హీరోయిన్ ని రివ్యూ చేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో మీనాక్షి చౌదరి భూతద్దం పట్టుకొని ఏదో వెతుకుతున్నట్లు కనిపిస్తుంది. ఈ మూవీలో దక్ష క్యారెక్టర్ లో మీనాక్షి నటించబోతున్నట్లు ఆ పోస్టర్లో రివిల్ చేశారు. చూస్తుంటే ఈ సినిమా ఏదో ఇన్వెస్టికేషన్స్ స్టోరీ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. అందులో మీనాక్షి ప్రత్యేకమైన ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు పోస్టర్ని చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ ఏడాది తండేల్ మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు హీరో నాగ చైతన్య.. ఈ మూవీ నాగచైతన్య లైఫ్ లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఏం తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఈసారి చైతు డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలో విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించబోతున్నాడు.. ఈ సినిమా మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ లాగా అనిపిస్తుందని గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ అని చూస్తే అర్థమవుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ పోస్ట్ అని రిలీజ్ చేశారు. దాంతో సినిమా స్టోరీ పై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.. మొదటిసారి నాగచైతన్య ఇలాంటి పాత్రలో నటించబోతున్నాడు.. ఈ మూవీ అతనికి మంచి విజయాన్ని అందిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాగచైతన్య బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : ఆ ‘ రింగ్ ‘ నాకు స్పెషల్.. నిజం చెప్పేసిందండోయ్…
అటు హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. ప్రస్తుతం ఈమె నాగచైతన్య సినిమాతో పాటుగా మరో రెండు చిత్రాలలో నటిస్తుంది. ఆజాగా ఆమె ఓ కోలీవుడ్ సినిమా యాడ్ అయింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ తో ఆమె ఓ సినిమాలో నటించబోతుందని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది..
In the depths of mystery, she unearths the truth. 🔍
Meet the intensely magnetic @Meenakshiioffl as #Daksha from the world of #NC24 ❤️🔥
More updates loading this 'N'ovember 🔥
Yuvasamrat @chay_akkineni @karthikdandu86 #SparshShrivastava @BvsnP @aryasukku #RagulDHerian… pic.twitter.com/oZOEElllim
— SVCC (@SVCCofficial) November 4, 2025