Kamal Hassan:ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోల కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా లేకపోయినా.. మరొకవైపు ఆయా హీరోల పుట్టినరోజు వేడుకలు, పెళ్లిరోజు వేడుకలు ఇలా ఏదైనా స్పెషల్ సందర్భం ఉందంటే చాలు కచ్చితంగా ఆయా హీరోల కెరియర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులు తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీటిని ఫోర్ కె వెర్షన్లో రీ రిలీజ్ చేయడమే కాకుండా అటు నిర్మాతలు కూడా భారీగా లాభపడుతున్నారు. మహేష్ బాబు (Mahesh Babu) ‘పోకిరి’ సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్ హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పైగా గతంలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి సరికొత్త కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇప్పుడు కమలహాసన్ మూవీ రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. అదేదో కాదు విక్రమ్. ప్రముఖ స్టార్ హీరో కమలహాసన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ ఏడవ తేదీన విక్రమ్ సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎంపిక చేయబడ్డ థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ కాబోతున్నట్లు.. ఈ మేరకు ఒక అధికారిక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక విషయంలోకి వెళ్తే.. కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా నవంబర్ ఏడవ తేదీన రీ రిలీజ్ కాబోతున్న ఈ విక్రమ్ సినిమాను.. హైదరాబాదులో సంధ్య 35mm థియేటర్ తో పాటు విమల్ 70mm థియేటర్లో స్క్రీనింగ్ చేయనున్నారు. అలాగే విజయవాడలో అలంకార్ థియేటర్లో , వైజాగ్ లో సంగం థియేటర్లో ఈ సినిమాను స్పెషల్ గా స్క్రీనింగ్ చేయనున్నారు ఇక ఈ విషయం తెలిసి అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.
ALSO READ:Jabardasth: జబర్దస్త్ షో నుంచి ఏకంగా 6 మంది గుడ్ బై.. అసలేం జరుగుతోంది?
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ లీడ్ రోల్ పోసిస్తూ విడుదలైన యాక్షన్ మూవీ. 2022లో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమలహాసన్ , ఆర్.మహేంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కమలహాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం జూన్ 3న తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే రూ.430.60 కోట్ల భారీ కలెక్షన్లు వసూలు చేసింది. తమిళనాడులో 184.30 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా విదేశీ మార్కెట్లో 122.7.5 కోట్లు రాబట్టి.. విడుదలైన సమయంలో అత్యధిక వసూలు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కమల్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి ఈ రీ రిలీజ్ లో ఇంకెలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.