Bad Girl OTT: ఓటీటీలోకి డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు వస్తుంటాయి. కొన్ని సినిమాలు గుండెల్లో వణుకు పుట్టించే హారర్ స్టోరీలతో వస్తే.. మరికొన్ని సినిమాలు మాత్రం విమర్శలకు కేరాఫ్ గా నిలుస్తున్నాయి. ఈ మధ్య ఓటీటీలో ఎటువంటి కంటెంట్ సినిమాలు వచ్చినా కూడా అవి బ్లాక్ బాస్టర్ అవుతున్నాయి. తాజాగా అలాంటి విమర్శలతో పాపులర్ అయిన ఓ తమిళ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ మూవీనే బ్యాడ్ గర్ల్.. టీజర్ తోనే వివాదాలకు కేరాఫ్ గా మారింది. ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మూవీ సెప్టెంబర్ 5 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి వచ్చేసింది. అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ‘జియో హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీలో అంజలి, శరణ్య రవిచంద్రన్, శశాంక్ బొమ్మిరెడ్డిపల్లి తదితరులు కీలక పాత్రలు పోషించారు.. స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.. విడుదలకు ముందు విమర్శలు అందుకున్న సరే రిలీజ్ అయ్యాక మాత్రం మంచి రెస్పాన్స్ని దక్కించుకుంది..
Also Read : ఆ ‘ రింగ్ ‘ నాకు స్పెషల్.. నిజం చెప్పేసిందండోయ్…
ఈ మూవీ టైటిల్ కు తగ్గట్లుగానే స్టోరీ ఉంటుంది. ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన యువతి ఆ తర్వాత సిటీ కల్చర్కు అలవాటు పడి ఎలా మారిపోయింది అన్నది ఈ సినిమా స్టోరీ. ఇందులో రమ్య అనే పాత్రలో అంజలి నటించింది.. చిన్నప్పటి నుంచి కట్టుబాట్ల మధ్య పెరుగుతుంది. కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి, కూతురిని బాధ్యతగా భావించే ఓ తండ్రి, కష్టమొస్తే ప్రాణాలైనా ఇచ్చే స్నేహితురాళ్లు మధ్య పెరిగింది. అందరికీ బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లే తనకి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని అనుకుంటుంది. అతని గురించి ఎన్నో కలలు కంటుంది. కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయి తో ప్రేమాయణం నడుపుతుంది. ఆ తర్వాత అది బ్రేకప్ అవుతుంది. ఉద్యోగంలో చేరినప్పుడు మరో అబ్బాయి తో ప్రేమాయణం నడిపి అతని తో డేటింగ్ లో ఉంటుంది. అది కూడా బ్రేకప్ అవుతుంది..ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ నుంచి ఆమె ఎలా మేల్కొంది? సమాజం ఆ యువతిని ఎందుకు బ్యాడ్ గర్ల్ అని ముద్ర వేసింది.. ఈ సినిమా మొత్తం ఆ యువతి చుట్టూనే తిరుగుతుంది. థియేటర్ల లో మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్నీ సొంతం చేసుకుంటుందో చూడాలి..