E-Paper
Advertisement

స్టాండప్ కమెడియన్ కు రూ.10లక్షలు జరిమానా?

స్టాండప్ కమెడియన్ కు రూ.10లక్షలు జరిమానా?
Advertisement

Film industry:తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయస్థానం ఉంది. అలాంటి న్యాయ వ్యవస్థ తీర్పును కూడా లెక్కచేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ధర్మాసనం ఊరుకుంటుందా? ఇతరులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ మరొకరు అలాంటి తప్పు చేయాలి అంటే వెనుకంజ వేసేలా ఊహించని తీర్పులిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లెక్కచేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఒక స్టాండప్ కమెడియన్ కి ఏకంగా రూ.10 లక్షల జరిమానా విధించడమే కాకుండా.. మిగతా స్టాండప్ కమెడియన్స్ కి కూడా హెచ్చరిక జారీ చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

స్టాండప్ కమెడియన్ కి రూ.10 లక్షల జరిమానా..

స్టాండప్ కమెడియన్ గా, ప్రముఖ యూట్యూబర్ గా పేరు సంపాదించుకున్న సమయ్ రైనాకి సుప్రీం కోర్ట్ ఊహించని షాక్ ఇచ్చింది. కోర్టు ఎదుటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినందుకుగానూ, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా రూ.10 లక్షల భారీ జరిమానా విధిస్తూ.. సంచలన తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి , జస్టిస్ జేవి మోహనాలతో కూడిన ధర్మాసనం.. రెండు వారాలలోగా ఈ మొత్తాన్ని జమ చేయాలి అని ఆదేశించింది.

చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవు..

Advertisement

అంతేకాదు అలా చేయని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విచారణ సందర్భంగా స్పందిస్తూ.. సమయ్ రైనా కోర్టును చాలా తేలికగా తీసుకోవడమే కాకుండా తమ ఆదేశాలను లెక్కచేయకుండా తప్పుడు ప్రకటనలు ఇచ్చాడని ధర్మాసనం మండిపడింది. ఈ నేపథ్యంలోనే రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ గట్టి హెచ్చరికలు కూడా జారీ చేసింది.

also read:లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన రామ్ చరణ్.. త్వరలోనే గృహప్రవేశం!

Advertisement

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లకి సుప్రీంకోర్టు హెచ్చరిక..

ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వాక్ స్వాతంత్రాన్ని కేవలం డబ్బు సంపాదన కోసమే వాడుకుంటూ.. సమాజంలో వివిధ వర్గాల మనోభావాలను గాయపరిచేలా ప్రవర్తిస్తే మాత్రం కఠిన పరిణామాలు ఉంటాయి అంటూ హెచ్చరించింది.

సమయ్ రైనా చేసిన కామెంట్స్ ఏంటి?

సమయ్ రైనా చేసిన తప్పేంటి? ధర్మాసనం ఆయనపై ఇంతలా ఫైర్ అవ్వడానికి అసలు కారణం ఏమిటి? అంటూ నెటిజన్లు కూడా ఆరా తీస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటంటే.. ‘ఇండియాస్ గాట్ లేటెంట్ ‘ సీజన్ 1లో దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను ఉద్దేశించి, సమయ్ రైనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై.. కంటెంట్ క్రియేటర్లు రణ్వీర్ అల్లాబాద్, ఆశిష్ చంచ్లానీ తోపాటు క్యూర్ ఎస్ఎంఎస్ ఫౌండేషన్ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కోర్టు విచారణను పెడచెవిన పెట్టిన సమయ్ రైనా..

దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం గతంలోనే సమయ్ రైనా తో పాటు ఇతర కమెడియన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని, అదేవిధంగా దివ్యాంగులకు సహాయం చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈయన మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఇటీవల తన ప్రదర్శనలో ఒక దానిలో కొనసాగుతున్న న్యాయపరమైన విచారణను జోక్ చేసినట్లు కనిపించారని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సుప్రీంకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై సమయ్ రైనా ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.

Related News

స్పీడ్ పెంచుతున్న సుక్కు ..వచ్చే ఏడు దసరా బరిలో దిగనున్న చరణ్ ?

నాని ‘ది ప్యారడైజ్’ మళ్లీ వాయిదా పడిందా?

ముదురుతోన్న ‘స్పిరిట్’ టైటిల్ వివాదం… ఆపేస్తామంటూ ఓపెన్ వార్నింగ్!

కాబోయే భర్త కోసం ప్రీతి ముకుందన్ కలలు.. ఆ ఒక్క క్వాలిటీ చాలంటూ!

అయ్యగారి ఖాతాలో 100 కోట్ల సినిమా పడ్డట్టేనా ?

లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన రామ్ చరణ్.. త్వరలోనే గృహప్రవేశం!

నువ్వు ఏం వేసుకున్నా ట్రోల్ చేస్తారు….ఏకిపారేసిన స్టార్ హీరోయిన్ !

Big Stories

Advertisement
×