E-Paper
Advertisement

లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన రామ్ చరణ్.. త్వరలోనే గృహప్రవేశం!

లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన రామ్ చరణ్.. త్వరలోనే గృహప్రవేశం!
Advertisement

Ram Charan :సామాన్యులకైనా సెలబ్రిటీలకైనా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కల. శాశ్వత చిరునామా.. అందుకే ఆ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రూపాయిని కూడబెట్టుకుని తాము అనుకున్న కలల ఇంటిని సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చిన ప్రదేశంలో నచ్చినట్టుగా ఆ ఇంటిని కలల సౌధం గా మార్చుకుంటూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఖరీదైన ప్రాంతాలలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తమకు నచ్చిన ఇళ్లను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి కొంతమంది స్వయంగా వాటిని నిర్మించుకుంటున్నారు కూడా.. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి మన టాలీవుడ్ హీరో కూడా చేరిపోయారు.

త్వరలో గృహప్రవేశం చేయబోతున్న రామ్ చరణ్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అభిరుచికి తగ్గట్టుగా హైదరాబాద్ శివారులలో ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ ను నిర్మిస్తున్నారట. నగరానికి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేవెళ్ల – మోకిల పరిసర ప్రాంతాలలో ఉన్న తన ఐదెకరాల సొంత స్థలంలో రాంచరణ్ ఈ విలాసవంతమైన ఫామ్ హౌస్ ను నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగే ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలనే కారణం తోనే ఇలా నగరానికి దూరంగా ఈ ఫామ్ హౌస్ ను అత్యంత సుందరంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లగ్జరీ ఫామ్ హౌస్ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే తమ కుటుంబ సభ్యులతో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఘనంగా గృహప్రవేశం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

రంగంలోకి ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్స్..

Advertisement

ఇకపోతే తమ కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్స్ అమీర్ శర్మ, హమీద శర్మలకు ఆ ఫామ్ హౌస్ బాధ్యతలు అప్పగించారట. ఆధునిక హంగులతో పాటు ప్రకృతికి దగ్గరగా ఉండేలా ఒక వినూత్నమైన ఆర్కిటెక్చర్ తో దీనిని తీర్చిదిద్దారు. అంతేకాదు ఈ ఫామ్ హౌస్ ఒక ప్రైవేట్ రిసార్ట్ ను తలపించేలా తీర్చిదిద్దారట. విలాసవంతమైన గదులు, లాన్ , ఇండోర్ , ఔట్డోర్ , స్విమ్మింగ్ పూల్, ప్రత్యేకించి పిల్లల కోసం గదులు, ప్లే గ్రౌండ్, మినీ థియేటర్ తో పాటు.. విదేశాల నుండి ప్రత్యేకంగా తెప్పించిన అలంకరణ వస్తువులతో ఈ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఈ ఫామ్ హౌస్ ఎంట్రీలో చూపరులను ఆకర్షించేలా మెగా ఫ్యామిలీ ఫోటో స్పెషల్ గా డిజైన్ చేయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక్కటేమిటి అన్ని రంగులతో ఈ ఫామ్ హౌస్ ను ఒక ఇంద్ర భవనంలా నిర్మిస్తున్నట్లు సమాచారం.

also read:కాయాదు లోహర్ తో ఇంత చనువుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?

సేద తీరడానికే కాదు సేద్యం చేయడానికి కూడా..

Advertisement

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఈ ఫామ్ హౌస్ లో సేదతీరడానికి మాత్రమే కాకుండా.. ఖాళీ సమయంలో ప్రకృతి సేద్యం చేయడానికి కూడా ఈ ఫామ్ హౌస్ ను రాంచరణ్ ఉపయోగించుకోబోతున్నారట. అటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఎప్పటికప్పుడు తమ వృత్తిపరమైన పనులలో బిజీగా తలమునకలవుతున్న నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి, తమ కూతుళ్లు , కొడుకుతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఈ ఫామ్ హౌస్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడే ఆర్గానిక్ వ్యవసాయానికి కావలసిన కొంత స్థలాన్ని కూడా కేటాయించారట. ఇకపోతే రామ్ చరణ్ ఇటీవల పెద్ది సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

ఫామ్ హౌస్ ఖరీదు.. ఓపెనింగ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం సుకుమార్ తో RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో కొత్త సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే రామ్ చరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ 5 ఎకరాలలో ఫామ్ హౌస్ కోసం సుమారుగా రూ.50 కోట్లకు పైగా ఖర్చుపెట్టి నిర్మిస్తున్నట్లు సమాచారం.

Related News

నాని ‘ది ప్యారడైజ్’ మళ్లీ వాయిదా పడిందా?

ముదురుతోన్న ‘స్పిరిట్’ టైటిల్ వివాదం… ఆపేస్తామంటూ ఓపెన్ వార్నింగ్!

కాబోయే భర్త కోసం ప్రీతి ముకుందన్ కలలు.. ఆ ఒక్క క్వాలిటీ చాలంటూ!

స్టాండప్ కమెడియన్ కు రూ.10లక్షలు జరిమానా?

అయ్యగారి ఖాతాలో 100 కోట్ల సినిమా పడ్డట్టేనా ?

నువ్వు ఏం వేసుకున్నా ట్రోల్ చేస్తారు….ఏకిపారేసిన స్టార్ హీరోయిన్ !

కాయాదు లోహర్ తో ఇంత చనువుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?

Big Stories

Advertisement
×