E-Paper
Advertisement

అయ్యగారి ఖాతాలో 100 కోట్ల సినిమా పడ్డట్టేనా ?

అయ్యగారి ఖాతాలో 100 కోట్ల సినిమా పడ్డట్టేనా ?
Advertisement

Akhil Lenin:హిట్టుపడ్డట్టే కనిపిస్తుంది.. ఇన్నాళ్లుగా ఏ హిట్టు కోసమైతే చకోర పక్షిలా ఎదురు చూశాడో అలాంటి సాలిడ్ హిట్ లెనిన్ సినిమాతో వచ్చినట్టే కనిపిస్తుంది .మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కొల్లగొడుతున్న వసూళ్లను చూస్తుంటే అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యేలానే కనిపిస్తుంది.పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్, అఖిల్ ఎనర్జిటిక్ యాక్షన్, స్క్రీన్‌పై భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ మెరుపులు, దానికి తోడు థమన్ ఇచ్చిన బిజిఎమ్ ‘ఊపు’.. ఓవరాల్ గా అన్నీ కలిసి ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాయనే చెప్పాలి.

ఏకంగా 16.7 కోట్ల గ్రాస్ వసూలు

Advertisement

ఇక మేకర్స్ వదిలిన లెక్కల ప్రకారం మొదటి రోజే తన కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ అంటే ఏకంగా 16.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన లెనిన్ వీకెండ్ కి వచ్చేసరికి వరల్డ్ వైడ్ గా ఏకంగా 61.1 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.దీంతో అఖిల్ సినిమా అంటేనే భయపడే డిస్ట్రిబ్యూటర్లు ,బయ్యర్లు ఇప్పుడు మాత్రం పండగ చేసుకున్నట్టే కనిపిస్తుంది.మామూలుగా ఏ పెద్ద సినిమాకి అయినా వీకెండ్ తర్వాత  వచ్చే సోమవారం పెద్ద లిట్మస్ టెస్ట్ లాంటిది .

also read :తారక్ ,బన్నీలు సీఎం సీటుపై కన్నేశారా ? ఏపీలో సరికొత్త ‘పొలిటికల్ మల్టీస్టారర్’!

Advertisement

ఇప్పటివరకు 67.2 కోట్లు

ఇక లెనిన్ కి కూడా అదే ఎదురైంది .ముఖ్యంగా వర్కింగ్ డే కావడంతో సోమవారం కలెక్షన్స్ లో ఏమైనా డ్రాప్ ఉంటుందా అని అనుకున్నారు అంతా .కానీ నాలుగో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా 6.1 కోట్ల గ్రాస్ వసూలు చేయడం మిరాకిల్ అనే చెప్పాలి.ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 65.2 కోట్ల గ్రాస్ లు కొల్లగొట్టింది.ఇక ఇప్పటివరకు 67.2 కోట్లు కొల్లగొట్టామని మేకర్స్ పోస్టర్ వదలడం తో  అక్కినేని ఫ్యాన్స్ కి మంచి హుషారునిస్తుంది .

100 కోట్లు దాటుతుందా లేక ఈలోపే చాప చుట్టేస్తుందా 

మరోవైపు బాక్సాఫీస్ వద్ద లెనిన్ కి సాలిడ్ గా కాంపిటీషన్ ఇచ్చే మరే సినిమా లేకపోవడం ఒక రకంగా అఖిల్ కి పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి .చూస్తుంటే థియేటర్లన్నీ లెనిన్ చేతిలోనే ఉన్నాయి.సో తెలుగులో తిరుగులేని మార్కెట్ నిసొంతం చేసుకోవడానికి అఖిల్ కి ఇది ఒక పర్ఫెక్ట్ ఫౌండేషన్ అనడంలో సందేహం లేదు .ఇంకా ఇలానే సెకండ్ వీకెండ్ కూడా కలెక్షన్లు మోత మోగిస్తే ఈ అయ్యగారు ఈజీగా ఒకవేళ 100కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం ఖాయం.

also read :ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా “1=100” టీజర్ లాంచ్ !

ఇక్కడ కొంచెం కలెక్షన్స్ అటు ఇటు అయినా ఆ వచ్చే శని ఆదివారాల్లో ఆ మ్యాజికల్ మైల్ స్టోన్అందుకోవడం అయ్యగారికి పెద్ద కష్టమేమీ కాదు.ఏది ఏమైనా వీడియో అఖిల్ .హలో. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ,ఏజెంట్ అంటూ వరుస సినిమాలతో  బొక్క బోర్లా పడ్డ ఈ అయ్యగారికి లెనిన్ సినిమా కాస్త ఊపిరి వచ్చిందని చెప్పాలి.చూడాలి మరి అక్కినేని అభిమానులు కోరుకుంటున్నట్టుగా ఈ సినిమా 100 కోట్లు దాటి పరుగులు పెడుతుందో లేక 100 కోట్ల లోపే చాప చుట్టేస్తుందో!

Related News

నాని ‘ది ప్యారడైజ్’ మళ్లీ వాయిదా పడిందా?

ముదురుతోన్న ‘స్పిరిట్’ టైటిల్ వివాదం… ఆపేస్తామంటూ ఓపెన్ వార్నింగ్!

కాబోయే భర్త కోసం ప్రీతి ముకుందన్ కలలు.. ఆ ఒక్క క్వాలిటీ చాలంటూ!

స్టాండప్ కమెడియన్ కు రూ.10లక్షలు జరిమానా?

లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన రామ్ చరణ్.. త్వరలోనే గృహప్రవేశం!

నువ్వు ఏం వేసుకున్నా ట్రోల్ చేస్తారు….ఏకిపారేసిన స్టార్ హీరోయిన్ !

కాయాదు లోహర్ తో ఇంత చనువుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?

Big Stories

Advertisement
×