E-Paper
Advertisement

ముదురుతోన్న ‘స్పిరిట్’ టైటిల్ వివాదం… ఆపేస్తామంటూ ఓపెన్ వార్నింగ్!

ముదురుతోన్న ‘స్పిరిట్’ టైటిల్ వివాదం… ఆపేస్తామంటూ ఓపెన్ వార్నింగ్!
Advertisement

Spirit Controversy:పేరులో ఏముంది అనుకోవడానికి లేదు. ఇప్పుడు పేరులోనే అంతా ఉంది మరి. ఎందుకంటే  సినిమా ఇండస్ట్రీలో టైటిల్ కి ఉండే క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు.ఒక రకంగా చెప్పాలంటే ఈ టైటిల్సే ఆడియన్స్ ని థియేటర్ల వరకు లాక్కొచ్చేది .గతంలో మహేష్ ఖలేజా, కళ్యాణ్ రామ్ కత్తి వంటి సినిమాలకు టైటిల్స్ విషయంలో ఎలాంటి వివాదాలు క్రియేట్ చేశాయో అంత ఈజీగా మర్చిపోలేము.గుణ శేఖర్ కత్తి అనే టైటిల్ నాది అంటూ మీడియా కెక్కి హడావిడి చేశాడు కూడా.

స్పిరిట్ అనగానే  గుర్తొచ్చేది ప్రభాస్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్

Advertisement

ఇప్పుడు తాజాగా అలాంటి ఓ టైటిల్ వివాదం టాలీవుడ్ లో రచ్చకెక్కింది.ఆ టైటిలే స్పిరిట్. మనకి స్పిరిట్ అనగానే  టక్కున గుర్తొచ్చేది సందీప్ రెడ్డి వంగా,ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్.కానీ ఇదే టైటిల్ పై మేము సినిమా తీశాం అంటున్నారు మహిళా రైతు నర్సమ్మ .అవును 8th వండర్ సినిమాస్ బ్యానర్‌ పై వెంకట రవీంద్ర దర్శకత్వంలో ‘స్పిరిట్- ఇస్ నాట్ వన్ ‘అనే సినిమాని నిర్మించింది ఈ నర్సమ్మ.అయితే ప్రభాస్ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ముందే తాము ఫిలిమ్ ఛాంబర్ లో ఈ టైటిల్ ని అఫీషియల్ గా రిజిస్టర్ చేయించుకున్నామని వాదిస్తుంది నరసమ్మ.

ఇక సినిమాని కంప్లీట్ చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుని రెడీ  అవుతున్న ఈ టైంలో, ముంబై చెందిన టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ పేరుతో తమకు వచ్చాయంటూ మీడియాకి ఎక్కింది.ప్రభాస్ మూవీ మేనేజర్లు తమ అడ్రెస్ ని రహస్యంగా సేకరించి తమని మానసికంగా వేధించేందుకే ఈ నోటీసులు పంపించారని ఆవేదన వ్యక్తం చేస్తుంది .

Advertisement

షరతులు పెట్టిన టీ సిరీస్ 

అయితే తాము ఎప్పుడు పెద్దవారితో గొడవలు కోరుకోలేదని ,ఒకవేళ ముందే చర్చించి ఉంటే తమ సినిమా పేరును మార్చుకోవడానికైనా సిద్ధంగా ఉండే వాళ్ళమని ,కానీ ఇలా కోర్టు నోటీసుతో భయపెట్టాలని చూడ్డం వల్ల తమకి ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిందని ఆరోపించింది .ఇక ఇక్కడితో ఆగకుండా  నరసమ్మ భర్త చేసిన కామెంట్స్ ఈ కాంట్రవర్సీని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.మొదట్లో సందీప్ రెడ్డి వంగ టీమ్ సినిమాని రిలీజ్ చేసుకోవచ్చని చెప్పిందని కానీ ఆ తర్వాత టి సిరీస్  నుంచి మరో అగ్రిమెంట్ పేపర్ వచ్చిందని చెప్పుకొచ్చాడు .

also read :అయ్యగారి ఖాతాలో 100 కోట్ల సినిమా పడ్డట్టేనా ?

దాని ప్రకారం సినిమా రిలీజ్ చేసుకోవచ్చు కానీ దానికి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ చేయకూడదు, పోస్టర్లు అంటించకూడదు, చివరికి ఓటిటి కూడా స్పిరిట్ అనే సినిమాని అమ్మకూడదు అనే షరతులు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.అయితే తమ వద్ద అన్ని పర్మిషన్స్ లీగల్ గా ఉన్నాయని అందువల్ల తమకు కండిషన్స్ పెట్టే హక్కు ఎవరికీ లేదని కుండబద్దలు కొట్టాడు నరసమ్మ  భర్త.అయితే ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ లోఉంటే  తమ సినిమా మాత్రం దేవుళ్ళు దయ్యాల చుట్టు తిరుగుతుందని ,అసలు తమ సినిమాకి వాళ్ళ సినిమాకి ఎక్కడ కంపారిజన్ అనేది  లేదంటూ చెప్పుకొచ్చాడు .

ఎలా రియాక్ట్ అవుతారో మరి

ఏది ఏమైనా మాది పెద్ద సినిమా అనే అహంతో మా సినిమాను తొక్కేయాలని చూస్తే మాత్రం వాళ్ల సినిమాని కూడా అడ్డుకుంటామని నరసమ్మ కుటుంబం డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.గతంలో ఇలాగే ఎన్నో పెద్ద సినిమాలకి టైటిల్ వివాదాలని  చర్చల ద్వారా  పరిష్కరించుకున్న సంఘం తెలిసిందే మరి .ఈ  ఇష్యూలో ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న సందీప్ వంగా  గాని అటు ప్రభాస్ గాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related News

స్పీడ్ పెంచుతున్న సుక్కు ..వచ్చే ఏడు దసరా బరిలో దిగనున్న చరణ్ ?

నాని ‘ది ప్యారడైజ్’ మళ్లీ వాయిదా పడిందా?

కాబోయే భర్త కోసం ప్రీతి ముకుందన్ కలలు.. ఆ ఒక్క క్వాలిటీ చాలంటూ!

స్టాండప్ కమెడియన్ కు రూ.10లక్షలు జరిమానా?

అయ్యగారి ఖాతాలో 100 కోట్ల సినిమా పడ్డట్టేనా ?

లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన రామ్ చరణ్.. త్వరలోనే గృహప్రవేశం!

నువ్వు ఏం వేసుకున్నా ట్రోల్ చేస్తారు….ఏకిపారేసిన స్టార్ హీరోయిన్ !

Big Stories

Advertisement
×