BigTV English
Advertisement

Humanoid Robot: ఇంటి పనులు చకచకా చేసే రోబో వచ్చేసింది.. ధర కూడా అందుబాటులోనే

Humanoid Robot: ఇంటి పనులు చకచకా చేసే రోబో వచ్చేసింది.. ధర కూడా అందుబాటులోనే

Humanoid Robot| సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో సినిమా చూడని వారు ఉండరు. ఆ సినిమాలో చిట్టి రోబో విలన్ గా మారేముందు మంచి రోబోగా ఇంటి పనులన్నీ చకచకా చేసేస్తుంది. అది సినిమా కాబట్టి అదంతా కేవలం ఊహ మాత్రమే అని అప్పుడంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఊహ నిజమైంది. నిజంగానే మానవ రూపంతో ఉన్న రోబో ‘నియో’ వచ్చేసింది. ఇది మీ ఇంటి పనులన్నీ చేస్తుంది. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, సామాన్లు తెచ్చిపెట్టడం అన్నీ చకచకా చేస్తుంది. మీతో మాట్లాడుతుంది కూడా!


ఈ స్మార్ట్ పనిమనిషిని అమెరికా-నార్వే కంపెనీ 1X టెక్నాలజీస్ తయారు చేసింది. ఈ కంపెనీ ఇంట్లో పనులు చేసేందుకు ఒక సహాకుడిలా ఈ రోబోని రూపొందించింది.

ధర, అందుబాటు

నియో రోబో ధర సుమారు 20,000 అమెరికన్ డాలర్లు, అంటే భారతీయ రూపాయల్లో సుమారు 16 లక్షలు. ఇప్పుడే చిన్న రిఫండబుల్ డిపాజిట్ ఇచ్చి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంది. అమెరికాలో 2026 నుంచి డెలివరీ మొదలవుతుంది. ఇతర దేశాలకు 2027లో వస్తుంది.


డిజైన్, శారీరక సామర్థ్యం

నియో బరువు కేవలం 30 కిలోలు మాత్రమే. కానీ 68 కిలోల వరకు సామాను ఎత్తగలదు. దాని దేహంపై మెత్తని నూలు బట్టలు ఉంటాయి – గోధుమ, బూడిద, ముదురు గోధుమ రంగుల్లో. రోబోట్ చాలా సహజంగా, మెత్తగా కదులుతుంది. దీనికి టెండన్ డ్రైవ్ సిస్టమ్ ఉంది. దీని రెండు చేతులు 22 డిగ్రీలు రౌండ్ తిరుగుతాయి. చిన్న పనులు కూడా కచ్చితంగా చేస్తుంది.

నిశ్శబ్దం, కనెక్టివిటీ

నియో ఇంట్లో పనిచేసే సమయంలో అందులో నుంచి శబ్దాలు రావు. ఫ్రిజ్ కంటే తక్కువ – కేవలం 22 డెసిబెల్స్ మాత్రమే ఇందులోని ప్రాసెసర్లు శబ్దం చేస్తాయి. మీ స్మార్ట్ హోమ్‌తో సులభంగా లింక్ అవుతుంది. వై-ఫై, బ్లూటూత్ లేదా 5జీ నెట్‌వర్క్‌తో పనిచేస్తుంది. మీ ఫోన్, ఇతర పరికరాలతో సులభంగా మాట్లాడుకుంటుంది.

కృత్రిమ మేధస్సు మెదడు

నియోలో పెద్ద భాషా మోడల్ ఉంది. మీ మాటలు అర్థం చేసుకుంటుంది. సహజంగా సంభాషిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు తన పేరుతో పిలిస్తే స్పందిస్తుంది. దాని పేరు పిలిచి ఈ పని చేయి, కాస్త సాయం చేయి అని అడగవచ్చు. కిచెన్‌లోని సామాను గుర్తుపెట్టుకుంటుంది. ఏ వస్తువు ఇంట్లో ఎక్కడ పెట్టాలో గుర్తుంచుకొని అన్నీ పద్ధతిగా పెడుతుంది. వంటకాలు సూచించగలదు కూడా!

ఎక్స్‌పర్ట్ మోడ్ ఫీచర్

ఎక్స్‌పర్ట్ మోడ్ అనే ఫీచర్ ఉంది. ఇది కొత్త పనులు నేర్చుకోవడానికి సహాయపడుతుంది. 1X కంపెనీ నిపుణుడు రిమోట్‌గా నియంత్రణ తీసుకుంటాడు. మీ అనుమతి ఉంటేనే జరుగుతుంది. ఈ రోబోకు మీరు పనులు నేర్పిస్తుంటే.. ఇంటర్నెట్ ద్వారా కంపెనీ ఆ పనులను రికార్డ్ చేసి కొత్త మోడల్స్ అభివృద్ధి చేస్తుంటారు. ఇంటి గోప్యత, భద్రత గురించి ఆందోళన ఉండొచ్చు. కానీ 1X భద్రతా నియంత్రణలు పాటిస్తామని హామీ ఇస్తోంది.

రోజువారీ ఇంటి పనులు

బట్టలు మడతపెట్టడం, నేల శుభ్రం చేయడం, సామాను ఒక గది నుంచి మరొకటి తరలించడం, లైట్లు ఆపడం – ఇవన్నీ నియో చేస్తుంది. మీ రోజువారీ షెడ్యూల్, షాపింగ్ లిస్ట్ గుర్తుంచుకుంటుంది. మీ పుట్టినరోజు వంటి ప్రత్యేక తేదీలు కూడా గుర్తుంచుకుంటుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిన ప్రతిసారీ కొత్త పనులు నేర్చుకుంటుంది. నియో మీ ఇంటికి నిజమైన సహాయకుడు. ఇంటి పనిచేసే సమయం, అవకాశం లేని వారికి ఈ రోబో పెద్ద వరం లాంటిది.

Also Read: ఏఐ బ్రౌజర్లు ప్రమాదకరం.. బ్యాంక్ అకౌంట్లు ఖాళీనే.. హెచ్చరిస్తున్న నిపుణులు

Related News

Jio prepaid offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. AI, OTT బెనిఫిట్స్ తో 6 చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ వచ్చేశాయ్!

Spotify – WhatsApp: Spotify సాంగ్స్ నేరుగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవచ్చు, ఎలాగంటే?

Social Media Hackers: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సమయం గడిపే వారికి వార్నింగ్.. సైబర్ దొంగల టార్గెట్ మీరే

OnePlus 15: రిలీజ్ కు రెడీ అయిన వన్‌ ప్లస్ 15.. స్పెసిఫికేషన్లు చూస్తే షాకవ్వాల్సిందే!

Big Screen Iphone Discount: అతి పెద్ద స్క్రీన్‌గల ఐఫోన్‌పై రూ.43000 డిస్కౌంట్.. రిలయన్స్ డిజిటల్‌లో సూపర్ ఆఫర్

Vivo Y500 Pro: కేవలం రూ.22400కే 200MP కెమెరా.. మిడ్ రేంజ్‌‌లో దూసుకొచ్చిన కొత్త వివో ఫోన్

Earthquakes Himalayas: భారత్ లో భూకంపాల రహస్యం బట్టబయలు.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు

Big Stories

×