Tamannaah Bhatia: సినీనటి తమన్నా(Tamannaah) ఇటీవల కాలంలో తన ప్రియుడు విజయవర్మకు(Vijay Varma) దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ లస్ట్ స్టోరీస్ 2(Lust Stories 2)షూటింగ్ సమయంలో ప్రేమలో పడినట్టు వారి ప్రేమ విషయాన్ని వెల్లడించారు. ఇలా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వీరిద్దరూ పెద్ద ఎత్తున కలిసి ఎంజాయ్ చేశారు. ఎక్కడ కనిపించినా జంటగా కనిపించడం, కలిసి వెకేషన్ లోకి వెళ్లడం వంటివి జరిగాయి. ఇలా వీరిద్దరు చట్టా పట్టాలేసుకొని తిరగడంతో త్వరలోనే పెళ్లి గురించి శుభవార్త చెబుతారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా వీరిద్దరూ బ్రేకప్ గురించి చెబుతూ షాక్ ఇచ్చారు.
ఫాతిమా సనా షేక్ తో డేటింగ్?
గత కొంతకాలంగా విజయవర్మ తమన్నా కలిసి కనిపించిన సందర్భాలు లేవు .అలాగే సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా డిలీట్ కావడంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని అర్థమవుతుంది కానీ ఇప్పటివరకు వీళ్ళిద్దరి తమ బ్రేకప్ గురించి అధికారికంగా తెలియజేయలేదు. ఇలా తమన్నాతో బ్రేకప్ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే నటుడు విజయ్ వర్మ మరో నటి ఫాతిమా సనా షేక్ (Fathima Sana Shaikeh)తో కలిసి కనిపించడంతో విజయ్ వర్మ తమన్నతో బ్రేకప్ తర్వాత ఫాతిమాతో రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా గత రెండు రోజులుగా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిన నేపథ్యంలో తమన్న స్పందించారు.
ప్రశాంతంగా ఊపిరి తీసుకో..
తాజాగా తమన్నా సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా తమన్న తెలియజేస్తూ..” ఏదైనా ఒక డిజైన్ తెల్లగా కనిపించకపోతే అది ఖాళీగా ఉందని కాదు, దాని వెనుక మరో ఏదో కారణం ఉందని అర్థం. ప్రతి చిన్న అంగుళాన్ని కూడా మనం పూర్తి చేయలేకపోవడం కూడా ఒక విశ్వాసమే. ఇదే నిజం ఈ నిజం మన జీవితానికి కూడా వర్తిస్తుంది. ప్రతి నిమిషం మనకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు కానీ, కొన్ని క్షణాలు మాత్రం చాలా ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి “అంటూ ఈమె చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తమన్నా పోస్ట్ ఎవరిని ఉద్దేశించి?
ఇక తమన్నా చేసిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారనేది తెలియదు కానీ ఈమె చెప్పింది మాత్రం అక్షర సత్యమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు అయితే కచ్చితంగా తమన్న ఈ పోస్ట్ తన మాజీ లవర్ ని ఉద్దేశించే చేశారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే విజయ్ వర్మ ఫాతిమా డేటింగ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు బయటకు రావడంతో ఫాతిమా పరోక్షంగా ఈ వార్తలపై స్పందించారు. తన జీవితంలోకి సరైన భాగస్వామి రాలేదని ప్రస్తుతానికి తాను సింగిల్ గా ఉన్నానని పరోక్షంగా ఈ వార్తలను ఖండించారు. ఏది ఏమైనా విజయ్ వర్మ నుంచి విడిపోయిన తర్వాత తమన్న కూడా పెద్దగా బయట కనిపించిన సందర్భాలు లేవు. ఇక ప్రస్తుతం ఈమె పలు సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. తమన్నా ఇటీవల ఓదెల 2 అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Also Read: 3BHK Trailer: మధ్యతరగతి సొంత ఇంటి కల.. మనసును హత్తుకునేలా 3BHK ట్రైలర్!