Shikhar Dhawan Girlfriend : సాధారణంగా ఎన్ని కష్టాలు ఉన్నా కొంత మంది నవ్వూతూ నటిస్తుంటారు. కొంత మంది కష్టాలను మరిచిపోవడానికి ఆడుతూ పాడుతూ జీవిస్తుంటారు. భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా అలాగే వ్యవహరిస్తాడు. అయితే ఆయన తొలి నుంచి కూడా అలాగే కొనసాగాడు. టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగాడు. ఒకానొక సమయంలో టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్లకు ధీటుగా ఆడాడు. ముఖ్యంగా ఈ గబ్బర్ సింగ్ కి గాయాలు కావడం.. మధ్య లో ఫామ్ కోల్పోవడంతో టీమ్ లో ప్లేస్ కోల్పోయి.. అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. తాను 2006లో చేసిన ఓ ఆకతాయి పనిని తాజాగా వెల్లడించడం విశేసం.
Also Read : WI vs AUS Test: ఇవేం మ్యాచ్ లు… బీచ్ లో బిర్యానీలు, బీర్లు తాగుకుంటూ మ్యాచ్ చూడడమేంటి.. ఇది కదా అసలు మజా
ఆమెతో ధావన్ రిలేషిప్..
అయితే 2006లో శిఖర్ ధావన్ ఓ అమ్మాయితో రిలేషన్ షిప్ లో కొనసాగాడు. భారత్ ఏ జట్టు తరపున ఆస్ట్రేలియా టూర్ కి వెల్లిన ధావన్ తోపాటు రోహిత్ శర్మకూడా సభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో భారత ఏ టీమ్ ప్లేయర్లకు షేరింగ్ లో హోటల్ రూమ్స్ కేటాయించేవాళ్లు. అలా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఒకే రూమ్ షేర్ చేసుకున్నారు. ఆ సమయంలో ఒక అమ్మాయి చాలా అందంగా ఉండేదని.. ఆమెని చూడగానే ప్రేమలో పడిపోయినట్టు తెలిపాడు. ఇక ఆమె తన కోసమే పుట్టిందని.. తనను పెళ్లి చేసుకోవాలని భావించినట్టు తెలిపాడు. ముఖ్యంగా ప్రాక్టీస్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాను. ఇక ప్రాక్టీస్ ముగిసిన వెంటనే ఆమెను కలుస్తూ ఉండేవాడిని. ఇక ఆ తరువాత నా హోటల్ రూమ్ కి ఆమెను రహస్యంగా తీసుకురావడం మొదలుపెట్టాను. అప్పుడు నేను, రోహిత్ ఒకే రూమ్ షేర్ చేసుకునేవాళ్లం.
నన్ను పడుకోనిస్తావా..?
ఇంగ్లీషులో మాట్లాడితే ఆమె కు అర్థం అవుతుందని.. తనను రూమ్ లో పడుకోనిస్తావా..? అని హిందీలో అడిగేవాడు రోహిత్ శర్మ. ఒక రోజు మా గర్ల్ ఫ్రెండ్, నేను కలిసి డిన్నర్ కి వెల్లాం. ఇక ఆ సమయంలో నేను ఆ అమ్మాయితో తిరుగుతున్నానని టీమ్ మొత్తం తెలిసిపోయింది. మా టీమ్ సెలక్టర్, నేను ఆమె చేతులు పట్టుకొని నడుస్తుంటే చూసాడు. అయితే నా స్థానంలో ఎవ్వరూ ఉన్నా ఆమె చేతిని వదిలేసి వెళ్లేవాల్లేమో. కానీ నాకు మాత్రం తానేమి తప్పు చేయడం లేదని అనిపించింది. అందుకే వదలకుండా గట్టిగా పట్టుకున్నాను. ఛాన్స్ దొరికితే టీమ్ నుంచి తీసేస్తారని అర్థమైపోయింది. ఇక ప్రతీ మ్యాచ్ లో మెరుగ్గా రాణించాలని ఫిక్స్ అయ్యాను. ఆ కారణంగా టీమిండియాలోకి రావడానికి చాలా సమయం పట్టిందని తన ఆటో బయోగ్రఫిలో రాసుకున్నాడు శిఖర్ ధావన్. ఇలాంటి సంఘటనలు చాలా మంది క్రికెటర్ల జీవితాల్లో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ అందులో కొంత మంది మాత్రమే వాటిని షేర్ చేసుకున్నారు. బయటికి చెప్పని వాళ్లు చాలానే ఉంటారని స్పష్టంగా అర్థమవుతోంది.