3BHK Trailer: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కోరిక. మనం నివసించడానికి ఒక ఇల్లు అవసరం మాత్రమే కాదు అది మధ్యతరగతి వారికి ఒక గౌరవం అని కూడా చెప్పాలి. ఇలా సొంత ఇంటి కల కోసం ఎంతోమంది జీవితాంతం శ్రమించి జీవిత చరమాంకంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇలా సొంత ఇంటి కల నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ (Siddarth)”3BHK” (3BHK Movie)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జులై 4వ తేదీ తెలుగు తమిళ భాష చిత్రాలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
సొంత ఇంటి కల…
తాజాగా చిత్ర బృందం హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వారు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే… మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తికి సొంత ఇంటి కల ఎంత అవసరమో అద్భుతంగా చూపించారు. అలాగే ఆ కలను నెరవేర్చుకోవడం కోసం ఎంత కష్టపడ్డారనే విషయాలను చూపించారు. చిన్నప్పటినుంచి తండ్రి కలలు కన్నా సొంత ఇంటిని తీర్చడం కోసం కొడుకు ఎలా కష్టపడ్డారు, తండ్రి కోరిక తీర్చడానికి ఏం త్యాగం చేశారు, ఇంటికలను నెరవేర్చడం కోసం ఒక మధ్య తరగతి కుటుంబం మొత్తం ఎంత కష్టపడ్డారు చాలా క్లియర్ గా చూపించారు.
మధ్యతరగతి కుటుంబం..
ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి మనసును హత్తుకుంటుందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైలర్ కు కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ తల్లితండ్రులుగా సీనియర్ నటుడు శరత్ కుమార్(Sarath Kumar), దేవయాని నటించారు. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ నిర్మాణ సంస్థలో అరుణ్ విశ్వ నిర్మించగా, శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ కు జోడిగా మీతా రఘునాథ్ (Meetha Raghunath) నటించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ సినిమా మొత్తం ఒక మధ్యతరగతి కుటుంబం సొంత ఇంటి కల కోసం ఎలా కష్టపడ్డారు ఏంటి అనే అంశాలు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఇక సిద్దార్థ్ హీరోగా తన 40వ సినిమా 3 BHK కావటం విశేషం. ఈ సినిమా కథ వినగానే వెంటనే సినిమాకు ఓకే చెప్పి తన తండ్రికి ఈ సినిమా కథ చెప్పడంతో నాన్న ముఖంలో ఒక సంతోషం కనిపించిందని, అది ఎంతో గర్వంగా అనిపించిందని తెలిపారు. నా తల్లిదండ్రులు కూడా 3 BHK లోనే ఉండేవారని సిద్దార్థ్ గుర్తు చేసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో ఈయన ఎంతో విభిన్నమైన సినిమాలోని ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక చివరిగా సిద్ధార్థ్ చిన్ని అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మరి 3BHK సినిమా సిద్దార్థ్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Junior Teaser: జూనియర్ సినిమా టీజర్ రిలీజ్… అదరగొట్టిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు!