Tamannaah Bhatia: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి తమన్నా(Tamannaah) ఒకరు. మంచి మనోజ్ హీరోగా నటించిన శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు. అనంతరం హ్యాపీడేస్(Happy Days) సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇలా తెలుగు, తమిళ, హిందీ భాషలలో అద్భుతమైన సినిమాలు చేస్తూ నటిగా ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికి తమన్న వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
తమన్నాపై కోప్పడిన హీరో?
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కెరియర్ మొదట్లో తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి అభిమానులతో పంచుకున్నారు. కెరీయర్ మొదట్లో ప్రతి ఒక్కరు కూడా కాస్త అభద్రత భావానికి గురి అవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజులలోనే తనకు సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే ఆయనతో నటించే సమయంలో ఒక సన్నివేశంలో నేను సౌకర్యవంతంగా ఉండలేకపోయానని ఈ విషయాన్ని తెలియజేస్తూ నేను ఆ సన్నివేశంలో నటించలేకపోతున్నానని చెప్పాను దీంతో ఆ హీరో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తమన్నా గుర్తు చేసుకున్నారు.
క్షమాపణలు చెప్పిన హీరో…
ఇలా నాపై గట్టిగా అరవడమే కాకుండా దర్శక నిర్మాతల వద్దకు వెళ్లి వెంటనే హీరోయిన్ ను మార్చేయండి అంటూ వారిపై కూడా కేకలు వేశారు. ఇలా సినిమా షూటింగ్లో అందరి ముందు ఆ హీరో నన్ను అరవడం చాలా బాధ కలిగించిందని అయితే నేను తిరిగి ఒక మాట కూడా మాట్లాడలేదని తమన్నా వెల్లడించారు. మరుసటి రోజు ఉదయం ఆ హీరో నా దగ్గరికి వచ్చి క్షమాపణలు కూడా చెప్పినట్లు ఈమె తెలియజేశారు. కోపంలో తాను అరిచానని, అలా ప్రవర్తించి ఉండకూడదు అంటూ తనకు క్షమాపణలు చెప్పినట్టు తమన్న తెలియజేశారు.
విజయ్ వర్మతో బ్రేకప్…
ఇలా అందరి ముందు తనని అవమానపరిచిన ఆ హీరో ఎవరు? ఏంటి? అనే విషయాలను మాత్రం ఈమె బయట పెట్టలేదు. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ఇటీవల తమన్నా ఓదెల2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక తమన్న ఇటీవల కాలంలో వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో కొద్దిరోజుల పాటు రిలేషన్ లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లిన జంటగా వెళ్లే ఇద్దరి మధ్య ఇటీవల కాస్త దూరం పెరిగిందని, ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది. ఇక వీరి బ్రేకప్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా, ఎక్కడ స్పందించకపోవడం విశేషం అలాగే సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేయటంతో ఈ బ్రేకప్ రూమర్స్ నిజమేనని అందరూ భావిస్తున్నారు.
Also Read: CPI Narayana: మేకప్ లేకుండా రజినీకాంత్ ను చూశారా.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!