CPI Narayana: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కార్మికులు సమ్మెకు(Workers Strike) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తమకు 30% వేతనాలు పెంచితేనే తిరిగి సినిమా షూటింగ్స్ పనులలో పాల్గొంటాము అంటూ డిమాండ్లు వ్యక్తం చేస్తూ.. సమ్మె నిర్వహిస్తున్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కార్మికులకు వేతనాలు పెంచడం జరుగుతుంది. అయితే ఈసారి ఇంకా కార్మికులకు వేతనాలు పెంచని నేపథ్యంలోనే సినీ కార్మికులందరూ కూడా సినిమా షూటింగ్స్ కి హాజరు కాకూడదని నిర్ణయించుకొని సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్లు ఈ విషయం గురించి చర్చలు జరపడమే కాకుండా కార్మికుల కోరినట్టు 30% ఇవ్వడం అంటే కుదరదని తెలిపారు.
రోడ్డున పడ్డ కార్మికులు…
ఇలా వేతనాల పెంపు విషయంలో కార్మికులకు నిర్మాతలకు మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ సమ్మె గురించి సీపీఐ నారాయణ స్పందించారు. ఈయన రాజకీయాలకు సంబంధించిన అంశాలతో పాటు సినిమాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. తాజాగా ఈ విషయం గురించి సీపీఐ నారాయణ (CPI Narayana)మాట్లాడుతూ.. కళామా తల్లికి సేవ చేస్తున్న కార్మికులందరూ కూడా ప్రస్తుతం రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అంటే కేవలం దర్శకుడు, హీరో, హీరోయిన్లు మాత్రమే కాదని ఈయన తెలియజేశారు.
రజనీకాంత్ మేకప్ లేకపోతే ఎలా కనిపిస్తారు?
ఇలా హీరో హీరోయిన్లు దర్శకులు పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకోవడానికి కార్మికుల శ్రమ ఎంతో అవసరమని ఈ సందర్భంగా కార్మికుల ప్రాధాన్యత గురించి తెలియజేశారు. ఒక్కో హీరోకు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. కానీ కార్మికులకు బేసిక్ వేతనాలు చెల్లించడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించారు.హీరోయిన్లను అందంగా చూపించే మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ కార్మికులే లేకపోతే వారు ఎలా కనిపిస్తారు? రజనీకాంత్ (Rajinikanth) మేకప్ లేకుండా ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి, ఆయనని మేకప్ లేకుండా ఎప్పుడైనా చూశారా అంటూ నారాయణ మాట్లాడారు.
ఇండస్ట్రీ ఆ నలుగురి చేతులలోనే…
తెలుగు సినిమా ఇండస్ట్రీ నలుగురు వ్యక్తుల చేతులలోనే ఉందని తెలిపారు. కార్మికులకు ఏదైనా ఆపద వస్తే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదు అంటూ ఈ సందర్భంగా ఈయన హెచ్చరికలు జారీ చేశారు. ఇలా కార్మికులకు మద్దతుగా సీపీఐ నారాయణ మాట్లాడటం సరైనది అయినప్పటికీ మేకప్ లేకుండా రజినీకాంత్ ని చూడగలమా? ఎప్పుడైనా చూశారా? అంటూ మాట్లాడటంతో రజినీకాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా హీరో రజనీకాంత్ ను అవమాన పరచడమే అంటూ సీపీఐ నారాయణ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం నలుగురు చేతులలోనే ఉందంటూ ఈయన మాట్లాడటంతో ఆ నలుగురు ఎవరు? అనే చర్చలు కూడా మరోసారి తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం కార్మికుల సమ్మె గురించి సినీ పరిశ్రమ గురించి నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.
Also Read: Producer Kalyan: చిన్న సినిమాలకు లైన్ క్లియర్… షూటింగులు జరపవచ్చు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!