Gujarat Bridge Collapsed: గత నెల 9న గుజరాత్ లోని ఆనంద్ లో ఘోర వంతెన ప్రమాదం జరిగింది. వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్న సమయంలో గంభీర వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో వాహనాలు వంతెన మీది నుంచి నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు.
లారీని సేఫ్ గా బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది
గంభీర వంతెన కూలిపోయిన ఘటనలో ఓ ట్రక్కు చిక్కుకుపోయింది. సగానికి పైగా వేలాడుతూ ఉండిపోయింది. తాజాగా దాన్ని వంతెన మీది నుంచి సేఫ్ గా తీసేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఎయిర్ బెలూన్స్ సాయంతో తాజాగా సేఫ్ గా ఆ ట్రక్కును బయటకు తీశారు. వంతెన ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అతి కష్టమీద ఈ రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వహించారు. ప్రత్యేక మెరైన్ ఎమర్జెన్సీ బృందం ఈ ఆపరేషన్ లో పాల్గొన్నది.
దగ్గర ఉండి పనులు పర్యవేక్షించిన కలెక్టర్
ఆపరేషన్ సక్సెస్ కావడం పట్ల ఆనంద్ కలెక్టర్ ప్రవీణ్ చౌదరి సంతోషం వ్యక్తం చేశారు. “గంభీర వంతెన ప్రమాదం తర్వాత, ఒక ట్రక్కు ఆక్కడే ఉండిపోయింది. ఆ వంతెన చాలా వరకు దెబ్బతిన్నది. పరిస్థితి చాలా ప్రమాదకర స్థితిలో ఉంది. ఈ సమయంలో సవాలుతో కూడిన పనికి రెస్క్యూ సిబ్బంది సిద్ధం అయ్యారు. వంతెనపై బరువు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. గుజరాత్‌లోని పోర్బందర్ కు చెందిన విశ్వకర్మ గ్రూప్ మెరైన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ సాకారంతో ఈ ఆపరేషన్ కొనసాగించాం. దేశంలోనే సముద్ర రక్షణలో అత్యుత్తమ నిపుణులతో కూడిన అత్యుత్తమమై 60 మందితో కూడిన ఈ బృందంతో 5 రోజుల పాటు ఆ ఆపరేషన్ కొనసాగించాం. ఎయిర్ బెలూన్స్ సాయంతో ఆ ట్రక్కును వారు విజయవంతంగా తీసుకొచ్చారు.సంక్లిష్టమైన ఇంజనీరింగ్, భద్రతా అంశాల కారణంగా ఈ ఆపరేషన్ చాలా సవాళ్లను ఎదుర్కొన్నది. చివరికి సక్సెస్ అయ్యింది” అని ఆయన వివరించారు. ఈ బృందంహైడ్రాలిక్ స్టాండ్ జాక్, నాలుగు పుల్లింగ్ ట్రక్కులను ఉపయోగించి ఈ ఆపరేషన్ పూర్తి చేసిందని ఆనంద్ కలెక్టర్ చౌదరి తెలిపారు.
ગંભીરા બ્રિજ પર બલુન ટેક્નોલોજી દ્વારા ટેન્કર બચાવની કામગીરી.. pic.twitter.com/hG4N5tRBPR
— Roads & Buildings Department, Govt. of Gujarat (@RnBGujarat) August 7, 2025
Read Also: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?
జూలై 9న ఘోర ప్రమాదం, 20 మందికి పైగా మృతి
వడోదర, ఆనంద్ ను కలిపే గంభీర వంతెనలోని ఒక భాగం జూలై 9న మహిసాగర్ నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు బ్రిడ్జి మీది నుంచి నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. రీసెంట్ గా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇటీవలి వంతెన కూలిపోయిన సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. తాజాగా వంతెన మీద చిక్కుకున్న ట్రక్కును వెలికి తీశారు.
Read Also: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!