Singer Rohit: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావిడి కనబడుతోంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోహిత్(Rohit) ఇటీవల నేషనల్ అవార్డు(National Award) అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న రోహిత్ తన ప్రియురాలు డాక్టర్ శ్రేయ(Shreya)ను పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత మూడు రోజులుగా రోహిత్ శ్రేయ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వీరి పెళ్లి ఫోటోలను రోహిత్ సిస్టర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. ఇక రోహిత్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. రోహిత్ ప్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బేబీ.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల ప్రధానోత్సవం లో భాగంగా బేబీ సినిమాలోని “ప్రేమిస్తున్నా” అనే పాటకు గాను రోహిత్ నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇలా నేషనల్ అవార్డు అందుకున్న వెంటనే ఈయన తన పెళ్లికి సంబంధించిన శుభవార్తను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఆగస్టు నెలలో తన ప్రేయసితో నిశ్చితార్థం జరుపుకున్న రోహిత్ నేడు పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
బేబీ సినిమాకు నేషనల్ అవార్డు..
ఇక రోహిత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్రేయ వృత్తి పరంగా ఈమె వైద్యురాలని తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక రోహిత్ కెరియర్ విషయానికి వస్తే..రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, కమిటీ కుర్రోళ్లు, కొండపొలం, సరిపోదా శనివారం, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్, జయమ్మ పంచాయతీ, బేబీ వంటి తదితర సినిమాలలో పాటలను ఆలపించారు అయితే ఈయనకు బేబీ సినిమాకు గాను నేషనల్ అవార్డు వరించింది. ఇలా నేషనల్ అవార్డు అందుకోవడంతో రోహిత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత రోహిత్ కెరియర్ పరంగా మరింత బిజీగా గడుపుతున్నారు