Janhvi Kapoor: అతిలోక సుందరి, దివంగత తార శ్రీదేవి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మనకు తెలిసిందే. అయితే శ్రీదేవి అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. శ్రీదేవి మరణాంతరం ఈమె వారసురాలిగా నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఈమె సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఇటీవల ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ద్వారా జాన్వీ తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే మరో పాన్ ఇండియా స్టార్ హీరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan)బుచ్చిబాబు సానా(Bucchibabu Sana) దర్శకత్వంలో పెద్ది సినిమా(Peddi Movie)లో నటిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని మార్చి27, 2026న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం అని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా శ్రీలంకలో ఒక షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి జాన్వి కపూర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ అచ్చియమ్మాగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇందులో ఈమె క్రికెట్ కామెంటేటర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం.
ఇక జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక గ్లింపు వీడియో మినహా ఎలాంటి అప్డేట్స్ విడుదల చేయలేదు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నారని అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. నవంబర్ 8వ తేదీ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ నిర్వహించబోతున్నారు.
పెద్ది పైనే అభిమానుల ఆశలు..
ఈ లైవ్ కన్సర్ట్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన పస్ట్ సింగిల్ కూడా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు ఇటీవల సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ ఒక పల్లెటూరు యువకుడిగా మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చరణ్ ఇటీవల నటించిన గేమ్ చేంజర్ సినిమా పూర్తిగా ప్రేక్షకులను నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ సినిమా పైనే అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి సక్సెస్ అందుకోబోతున్నారో తెలియాల్సి ఉంది.
Also Read: Ajith Kumar: కరూర్ తొక్కిసలాట పై స్పందించిన అజిత్.. సినిమా వాళ్ళకే ఎందుకిలా అంటూ!