Nara Rohit: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రభాస్ (Prabhas) తర్వాత నారా రోహిత్ (Nara Rohit) పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నారా రోహిత్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈయన తాజాగా ఒక ఇంటివాడయ్యాడు. ‘ప్రతినిధి 2’ సినిమాలో హీరోయిన్ గా నటించిన శిరీష లెల్లా (Sirisha lella) తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈయన.. పెద్దలను ఒప్పించి అక్టోబర్ 31వ తేదీన ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, రాజకీయ నాయకులు , సినీ సెలబ్రిటీల మధ్య ఏడడుగులు వేసిన ఈ జంటకు పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇకపోతే పెళ్లయిన రెండవ రోజే ఎమోషనల్ నోట్ పంచుకున్నారు నారా రోహిత్.. ఇది చూసిన అభిమానులు ఏంటి గురు ఇది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి నారా రోహిత్ పంచుకున్న ఆ ఎమోషనల్ నోట్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం.. నారా రోహిత్ ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేస్తూ.. “మీ ఆశీర్వాదాలతో మా ప్రత్యేకమైన రోజును మరింత ప్రకాశవంతంగా, అందంగా మార్చారు. నా రోజును మరింత అద్భుతంగా మార్చిన నా స్నేహితులు కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ మాకు బలాన్ని ఇస్తోంది. ఈ ఆనందమైన మధుర జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. పెద్దమ్మ, పెదనాన్న, లోకేష్ అన్నయ్య, బ్రాహ్మణి వదిన , తేజస్విని, మామ, వసుంధర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సినిమా, రాజకీయ రంగాలకు చెందిన వారందరూ మీ మద్దతు, ప్రేమ మా హృదయాన్ని తాకింది. మా సోషల్ మీడియా స్నేహితులకు.. మీ ప్రేమ దూరం కాలానికి మించి ప్రయాణిస్తుందని మాకు గుర్తుచేసింది. ముఖ్యంగా మా రోజును ప్రపంచవ్యాప్తంగా మనుషులు పట్టుకోలేని మాయాజాలంతో నింపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు” అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే నారా రోహిత్ ఎమోషనల్ అవుతూ పంచుకున్న ఈ పోస్ట్ చూసి ఏంటి గురువు ఇది నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వాలా.. మేమంతా నీ వెంటే ఉంటాం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:Tamannah bhatia: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన తమన్నా.. ఏమన్నారంటే?
నారా రోహిత్, శిరీష లెల్లా విషయానికి వస్తే ప్రతినిధి 2 సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. గత ఏడాది అక్టోబర్లో కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది మొదట్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా నారా రోహిత్ తండ్రి స్వర్గస్తులయ్యారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కాస్త వాయిదా పడింది. ఇప్పుడు ఏడాది పూర్తి కావడంతో నారా రోహిత్, శిరీష ఏడు అడుగులతో ఒక్కటయ్యారు.
Thank You!❤️ pic.twitter.com/I6MI4yWWQ1
— Rohith Nara (@IamRohithNara) November 1, 2025