Ajith Kumar: ప్రముఖ సినీ నటుడు విజయ్ దళపతి(Vijay Dhalapathy) టీవీకే పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ పరంగా ఈయన రాజకీయ వ్యవహారాలలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ రాజకీయ కార్యక్రమాలలో భాగంగా కరూర్ లో నిర్వహించిన సభలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్ బహిరంగ సభను నిర్వహించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా సుమారు 41 మంది వరకు అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ తొక్కిసలాట ఘటన తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో అలాగే సినీ ఇండస్ట్రీలోనూ పెద్ద ఎత్తున చర్చలకు కారణం అయింది. విజయ్ కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ వారికి పరిహారం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు స్పందించారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) సైతం ఘటనపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను ఈ వ్యాఖ్యలు ఎవరిని అనగదొక్కడానికి చేయట్లేదని తెలిపారు. కరూర్ లో జరిగిన ఈ తొక్కిసలాట కారణంగా నేడు తమిళనాడులో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ ఘటనకు కేవలం విజయ్ మాత్రమే బాధ్యుడు కాదనీ, ఈ ఘటనకు మనం అంతా కూడా బాధ్యత వహించాలని తెలిపారు.
ఈ విషయంలో మీడియా కూడా కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఇలాంటి గందరగోళ వాతావరణం కేవలం సినిమా ఇండస్ట్రీకి ఎందుకు జరుగుతుందని అజిత్ ప్రశ్నించారు. ఎంతోమంది క్రికెట్ చూడటం కోసం వెళ్తుంటారు అక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఆ సంఘటనలను మీరు చూడరు కదా.. కేవలం థియేటర్లలో మాత్రమే ఇలాంటి సంఘటనలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. సెలబ్రిటీలు సినీ ప్రముఖుల విషయంలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించారు.
చిత్ర పరిశ్రమపై చెడు ప్రభావం..
ఇలాంటి సంఘటనలు జరగాలని ఎవరు కూడా కోరుకోరు కానీ సెలబ్రిటీల విషయంలో ఇలాంటి సంఘటనలను హైలెట్ చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమను చెడుగా చూపిస్తోందని అజిత్ కరూర్ తొక్కిసలాట ఘటన గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపై సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా భారీ జన సమూహాన్ని చూపించాలనుకోవటం పూర్తిగా మానుకోవాలని అజిత్ సలహాలు కూడా ఇచ్చారు. ఇక ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులు అవుతున్న ఇప్పటికీ ఈ విషయంపై తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక బాధితులను పరామర్శించడం కోసం నేరుగా విజయ్ వెళ్తున్నప్పటికీ బాధిత కుటుంబాల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుంది. కొంతమంది బాధిత కుటుంబాలు విజయ్ అందించిన పరిహారాన్ని తిరస్కరిస్తుండటం గమనార్హం.
Also Read: Singer Rohit: ప్రియురాలితో ఏడడుగులు నడిచిన సింగర్ రోహిత్.. ఫోటోలు వైరల్!