Ranji Trophy 2025: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 2025-2026 ( Ranji Trophy 2025/26) ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. చాలా అట్టహాసంగా ఈవెంట్ ను ప్రారంభించారు. అయితే రంజీ ట్రోఫీ 2025-2026 టోర్నమెంట్ ప్రారంభంలోనే టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఈ సారి మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా.. తొలి మ్యాచ్ లోనే డకౌట్ అయ్యాడు. అంతేకాదు.. ఐదు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది మహారాష్ట్ర టీం. ఇందులో నలుగురు ప్లేయర్లు కూడా డకౌట్ కావడం విశేషం. పృథ్వీ షాతో పాటు మరో నలుగురు ప్లేయర్లు డకౌట్ అయ్యారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లో మహారాష్ట్ర వర్సెస్ కేరళ మధ్య ఫైట్ జరుగుతోంది. ఈ సందర్భంగా నే ఐదు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది మహారాష్ట్ర. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది.
Also Read: IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజయం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మన ర్యాంక్ ఎంతంటే
రంజి ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ లో కేరళ వర్సెస్ మహారాష్ట్ర మధ్య ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కేరళ. దానికి తగ్గట్టుగానే మహారాష్ట్ర బౌలర్లను ముప్పతిప్పలు పెట్టింది. మహారాష్ట్ర బ్యాటర్లు వరుసగా నలుగురు కూడా డక్ ఔట్ అయ్యారు. ఈ లిస్టులో పృథ్వీ షా కూడా ఉన్నాడు. అతనితోపాటు అర్షిన్ కులకర్ణి, సిద్దేశ్ వీర్, కెప్టెన్ అంకిత్ కూడా ఉన్నాడు.
ఈ నలుగురు డక్ అవుట్ కావడంతో ఆరు ఓవర్లలోనే ఐదు బరువులు చేసిన మహారాష్ట్ర నాలుగు వికెట్లు కోల్పోయినట్లు అయింది. అదే కష్టాల్లో ఉన్న మహారాష్ట్రను రుతురాజు గైక్వాడ్ ఆదుకుంటున్నాడు. అతడు 91 పరుగులు చేసి కాసేపటి క్రితమే వికెట్ సమర్పించుకున్నాడు. దీతో ప్రస్తుతానికి 56 ఓవర్స్ ఆడిన మహారాష్ట్ర 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మరో గంట సమయానికి మహారాష్ట్ర ఆల్ అవుట్ అయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.
రంజీ ట్రోఫీ 2025-2026 సీజన్ అక్టోబర్ 15వ తేదీ అంటే ఇవాల్టి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 90 సీజన్స్ పూర్తి కాగా ఇది 91వ సీజన్. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపులో 32 జట్లు ఉండగా, ప్లేట్ గ్రూప్ లో ఆరు జట్లు ఉంటాయి. ఇలా మొత్తం 138 మ్యాచ్ లు జరగనున్నాయి. రెండు దశల్లో రంజీ ట్రోఫీ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఐపీఎల్ రాక ముందు ఈ రంజీ ట్రోఫీలో రాణించిన వాళ్లను భారత జట్టులోకి సెలెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ ప్రారంభమైన నుంచి అందులో బాగా ఆడిన ప్లేయర్లను నేరుగా జట్టులోకి తీసుకుంటున్నారు. ఇక టీమిండియా ప్లేయర్లకు కొన్ని రూల్స్ పెట్టింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఫామ్ కోల్పోకుండా ఉండాలంటే టీమిండియా ప్లేయర్లు కూడా రంజీ ట్రోఫీలు ఆడుకోవచ్చని సూచనలు చేసింది బీసీసీఐ.
🚨 This is happening in the 𝐑𝐚𝐧𝐣𝐢 𝐓𝐫𝐨𝐩𝐡𝐲 right now 😲 pic.twitter.com/KL7uVOYTFi
— Cricbuzz (@cricbuzz) October 15, 2025