Maoists: దేశంలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్ గఢ్ లో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ సమక్షంలో మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో పది మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. పీఎల్‌జీఏ-1 బెటాలియన్ కు చెందిన ఇద్దరు కీలక సభ్యులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులపై గతంలో అధికారులు రూ.50 లక్షల రివార్డు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూ పేశ్ (తక్కళ్లపల్లి వాసుదేవరావు) కూడా రేపు లొంగిపోనున్నట్టు సమాచారం. వాసుదేవ రావు నేతృత్వంలో వివిధ స్థాయిలకు చెందిన దాదాపు 70 మంది పార్టీ కేడర్లు రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ లేదా డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. తమ ఆయుధాలను సైతం అప్పగించే ఈ బృందంలో డీకేఎస్‌డీఎస్ సభ్యులు రాజమన్, రనితలతో సహా ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన పలువురు డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ పార్టీ కమిటీల సభ్యులు ఉన్నారని సమాచారం.
వీరంతా ఇప్పటికే జగ్దల్ పూర్ చేరుకున్నారని.. రేపు నిర్వహించే లొంగుబాటు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈరోజు ఉదయం గడ్చిరోలిలో జరిగిన ఒక సభలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో పొలిట్ బ్యూరో సభ్యుడు అభయ్ సోనూ అలియాస్ భూపతి అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వంలో 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే.
ALSO READ: Uttarakhand News: అంతుచిక్కని వింత జ్వరం.. 10 మంది మృతి, భయం గుప్పిట్లో గ్రామాలు