E-Paper
Advertisement

ప్ర‌కాశ్‌రాజ్‌- రావ‌ణ్‌! ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు! సీన్‌లోకి విజ‌యసాయి రెడ్డి…

ప్ర‌కాశ్‌రాజ్‌- రావ‌ణ్‌! ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు! సీన్‌లోకి విజ‌యసాయి రెడ్డి…
Advertisement

రావ‌ణ్‌ను ప్ర‌కాశ్‌రాజ్‌తో పోల్చుతున్నారు. ప్ర‌కాశ్‌రాజ్‌ను రావ‌ణ్‌తో పోల్చుతున్నారు. ఏపీలో రాజ‌కీయాలు రోజుకో మ‌లుపుతిరుగుతున్నాయి. మొన్న‌టిదాకా నెత్తిన మోసిన వైసీపీ .. ఇప్పుడు  ప్ర‌శ్న రావ‌ణ్ (జోసెఫ్‌)ను త‌మ పార్టీ కాదంటున్న‌ది. అత‌గాడు టీడీపికి చెందిన వాడని ముద్రేసింది. చంద్ర‌బాబు ఇవాళ రావ‌ణ్ గురించి మాట్లాడుతూ.. వైసీపీకి రావ‌ణ్‌కు సంబంధాలున్నాయ‌ని తేల్చాడు.

అంతే కాదు.. హిందూ సంప్రాదాయ‌ల‌ను కించ‌ప‌రిచేలా, మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టేలా అత‌ని కామెంట్లున్నాయని, పాకిస్తాన్‌తో సంబంధాలున్నాయ‌నే విధంగా బాబు మాట్లాడాడు. ఇప్ప‌టికే అత‌నిపై ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ట్టం కింద కేసులు పెట్టారు. అమ్మాయిల‌ను బెదిరించిన అశ్లీల వీడియోల‌న్నారు. ఇవ‌న్నీ ఓ వైపు న‌డుస్తుండగానే సీన్‌లోకి విజ‌య్ సాయి రెడ్డి వ‌చ్చాడు.

Advertisement

అచ్చం చంద్ర‌బాబు మాట్లాడిన‌ట్టే మాట్లాడాడు. హిందూ సంప్ర‌దాయాల‌న్నాడు. మ‌తాల మ‌ధ్య‌, కులాల మ‌ధ్య చిచ్చుపెట్టేందుకు వీరు ఎక్క‌డ్నుంచి వ‌చ్చార‌ని నిల‌దీశాడు. వీరిని దేశం దాటి బ‌య‌ట‌కు పంపించేయాల‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చాడు. సేమ్ టు సేమ్ అన్నీ చంద్ర‌బాబు లాగే మాట్లాడాడు. కానీ ఇందులో ప్ర‌కాశ్‌రాజ్‌ను తీసుకురావ‌డమే ఇవాల్టి ట్విస్ట్‌.

ప్ర‌కాశ్‌రాజ్ కూడా ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ఇష్యూలో మ‌ద్ద‌తుగా నిలిచి, ప‌వ‌న్‌ను వ్య‌తిరేకించిన విష‌యం తెలిసిందే. సేమ్‌, రావ‌ణ్ విష‌యంలో కూడా అలాగే త‌న స్టాండ్‌ను బ‌య‌ట‌పెట్టుకున్నాడు ప్ర‌కాశ్‌రాజ్‌. వేట మీరు మొద‌లు పెట్టారు. ప్ర‌జ‌లు దీనికి ఫినిషింగ్ ట‌చ్ ఇస్తార‌ని, ప‌రోక్షంగా మీ ఓట‌మి త‌ప్ప‌ద‌ని కూట‌మి ప్ర‌భుత్వానికి వార్నింగ్ ఇచ్చి మ‌రీ పోయాడు.

Advertisement

దీంతో ఇప్పుడు ప్ర‌కాశ్‌రాజ్‌ను కూడా ఈ రావ‌ణ్‌తో జ‌త‌క‌ట్టి టార్గెట్ చేస్తున్నారు కూట‌మి ప్ర‌భుత్వం. ఓ వైపు బాబు, మ‌రోవైపు జ‌న‌సేనా నేత‌లు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తాజాగా విజ‌య్ సాయి రెడ్డి కూడా వీరికి జ‌త‌య్యాడు. విజ‌య్ సాయిరెడ్డి ఇంకా బీజేపీలో చేర‌లేదు. కానీ ఆ పార్టీ సానుభూతి ప‌రుడిగా ఉన్నాడు. రాజ్య‌స‌భ సీటు కూడా ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు.

మొన్న‌టిదాకా న్యూట్ర‌ల్‌గా ఉన్న విజ‌య్‌… ఇప్పుడు రావ‌ణ్ ఇష్యూలో తెర మీద‌కు వ‌చ్చాడు. వైసీపీని బాగానే తిట్టాడు. విమ‌ర్శించాడు. బీజేపీ స్టాండ్‌ను అమ‌లు చేసిన‌ట్టుగా మాట్లాడాడు. మిత్రధ‌ర్మంలో భాగంగా కూట‌మి స‌ర్కార్ మాట‌ల‌తో జ‌త‌క‌ట్టాడు. ప్ర‌కాశ్‌రాజ్‌ను, రావ‌ణ్‌ను దేశ‌ద్రోహులుగా చిత్రీక‌రించే కామెంట్లు చేశాడు. మీ పార్టీ అంటే మీ పార్టీ అని ఒక‌ర్నొక‌రు తిట్టుకుంటూనే, నెపం మీదేసుకుంటూనే… రావ‌ణ్ చ‌ర్య‌ల‌ను మేం స‌మ‌ర్థించ‌డం లేద‌నే వాద‌న తాజాగా వైసీపీ తీసుకొచ్చి వాడిని ఒంట‌రిని చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇవీ ఇప్పుడు ఏపీలో జ‌రుగుతున్న తాజా రాజ‌కీయ ప‌రిణామాలు.

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

Big Stories

Advertisement
×