BigTV English

Tollywood star heroes : చిన్న హీరోల పెద్ద హిట్లు, స్టార్ హీరోలు ఇకనైనా తగ్గండయ్యా

Tollywood star heroes : చిన్న హీరోల పెద్ద హిట్లు, స్టార్ హీరోలు ఇకనైనా తగ్గండయ్యా

Tollywood star heroes : రీసెంట్ టైమ్స్ లో జనాలు థియేటర్ కు రావడం మానేశారు అని కొంతమంది నిర్మాతలు ఆవేదన. ఒక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్ కు ఎందుకు రారు అని కొన్ని సినిమాలు ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో చాలామంది చిన్న హీరోలు పెద్ద సక్సెస్ అందుకుంటున్నారు. పెద్ద హీరోలు సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరుస్తూనే ఉన్నాయి. కేవలం పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఆడియన్స్ థియేటర్ కి వస్తారు అని కొంతమంది అంటుంటారు ఒక రకంగా అది కూడా నిజమే. ఇప్పుడు పెద్ద సినిమా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తే ఆడియన్స్ మరోసారి థియేటర్ కు రావడానికి అంతగా ఇష్టపడరు.


ఓటిటి కి అలవాటుపడ్డారు 

ఓటిటి ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత చాలామంది థియేటర్ కు రావడం మానేసి ఇంట్లో టీవీలో సినిమాలు చూస్తున్నారు. అందుకే ఏ లాంగ్వేజ్ లో గొప్ప సినిమా ఉన్న దాన్ని విపరీతంగా సోషల్ మీడియాలో ఎలివేట్ చేస్తూనే ఉంటారు. అది కొంతమందికి నచ్చటం వలన ఇంకొంతమందికి చెప్పడం. థియేటర్ రికార్డ్స్ నుంచి ఓటీపీ లో కూడా ఎన్ని మిలియన్ అవర్స్ చూశారు అని కూడా ఒక రికార్డు మొదలైంది. అలానే ఏ ర్యాంకు లో సినిమా ఉంది అనేది కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది.

చిన్న సినిమాలు పెద్దహిట్లు 

ఇక సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన కొన్ని చిన్న సినిమాలు అద్భుతమైన సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మౌళి నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా విపరీతమైన సక్సెస్ సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. అలానే తేజా సజ్జా నటించిన మిరాయి సినిమా కూడా విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తుంది. మరోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిస్కిందపురి సినిమా కూడా మంచి టాక్ సాధించింది. ఈ మూడు సినిమాలకి కూడా ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.


పెద్ద హీరోలు మైండ్ సెట్ మారాలి 

కొన్ని సినిమాలను అనౌన్స్ చేసేటప్పుడే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాం అని చెబుతూ ఉంటారు. అలానే విఎఫ్ఎక్స్ కోసం చాలా ఖర్చు పెట్టాం అని చెబుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన మిరాయి సినిమా చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. అంత తక్కువ బడ్జెట్లో గ్రాండ్ విజువల్స్ ఎలా తీసుకొచ్చారు అనేది అంతమందికి వస్తున్న సందేహం. అయితే దీనిని బట్టి పెద్ద సినిమాలు పైన ఇప్పుడు నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. హై బడ్జెట్ సినిమాలు విఎఫ్ఎక్స్ కోసం ఖర్చు కావడం లేదు. హీరోల రెమ్యూనరేషన్ కోసమే అవి హై బడ్జెట్ లుగా మారుతున్నాయి. అని సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: Ester Valerie Noronha : సంస్కార్ కాలనీ ఆంటీ కి మళ్ళీ పెళ్లి? కుర్రకారు ఏమైపోతారో….

Related News

Kishkindhapuri : హరిహర వీరమల్లు కంటే ఆ విషయంలో బెల్లం అన్న సినిమానే టాప్

Big producer : తన బ్యానర్ లో సినిమాలు చేయమని రాయబారాలు పంపుతున్న బడా నిర్మాత

Kangana Ranaut: కంగనాపై సుప్రీంకోర్టు ఫైర్.. పిటిషన్ రద్దు!

Anushka Shetty: వాస్తవ ప్రపంచం అదే.. అనుష్కలో ఈ మార్పుకి కారణం?

Hansika Motwani: హన్సికకు కోర్టులో ఊహించని ఎదురుదెబ్బ.. అసలేం జరిగిందంటే?

Mirai: మిరాయ్ మూవీపై రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ పోస్ట్.. రూ.1000 కోట్ల క్లబ్ గ్యారెంటీ!

Samyuktha Menon: అమ్మడి రేంజ్ మామూలుగా లేదుగా.. లైనప్ చూస్తే షాక్!

Big Stories

×