IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ ను ప్రసారం చేయబోమని కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆటగాళ్లు ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ స్పందిస్తూ.. సెప్టెంబర్ 14న పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియాకు చుక్కలు చూపించడం ఖాయమని పేర్కొన్నాడు. ప్రస్తుతం కమ్రాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read : Asia Cup 2025: పాకిస్థాన్ చేతిలో ఓడితే… టీమిండియా ప్లేయర్లను దేవుడు కూడా కాపాడలేడు !
స్టంప్స్ వెనక ఎప్పుడూ ఏదో ఒకటి..
కమ్రాన్ అక్మల్ పాకిస్తాన్ కి చెందిన వికెట్ కీపర్. స్టంప్స్ వెనక ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఇతను చాలా సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొన్నాడు. 2010 ఆసియా కప్ లో ఈ విషయం పై గంభీర్ కి – అక్మల్ కి మధ్య చిన్నపాటి వారే జరిగింది. ఈ మధ్య కాలంలో కమ్రాన్ అక్మల్ నిత్యం సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నాడు. వాస్తవానికి అతను అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికి ఎనిమిది సంవత్సరాలు దాటినా.. అక్మల్ వికెట్ కీపింగ్ గురించి అభిమానులకు ఇప్పటికీ గుర్తుండటం గమనార్హం. ఆసియా కప్ 2025లో హై ఓల్టేజీ మ్యాచ్ సెప్టెంబర్ 14న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ పై ఇరు దేశాల అభిమానులు భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. చివరిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ తలపడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఆరు నెలల తరువాత అభిమానులను ఉర్రూతలూగించనున్నాయి.
పాకిస్తాన్ కూడా అద్భుతమైన ఫామ్ లో..
ఈ మెగా టోర్నీలో ఇప్పటికే భారత్ అద్భుతమైన విజయంతో శుభారంభం చేసింది. యూఏఈను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పాకిస్తాన్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉంది. పాక్ ఒమన్ చిత్తు చేయాలని చూస్తుంది. మరికొద్ది నిమిషాల్లోనే ఒమన్ తో పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ లేకపోయినప్పటికీ చాలా మంది యంగ్ టాలెంటేడ్ ఆటగాళ్లు అయితే ఉన్నారు. పాకిస్తాన్ జట్టు ఎప్పుడు ఏవిధంగా ఆడుతుందో చెప్పడం కష్టమే. ఒక్కసారి వరల్డ్ నెంబర్ వన్ జట్టును కూడా ఓడిస్తుంది. మరోసారి అప్గానిస్తాన్, జింబాబ్వే వంటి పసికూన చేతిలో ఘోర పరాజయం పాలవుతుంది. ప్రస్తుతం ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో పటిష్టంగా కనిపిస్తోంది. ఫఖర్ జమాన్ గాయం నుంచి కోలుకొని తిరిగి రావడంతో మరింత బలం పెరిగినట్టయింది. జమాన్ కి భారత్ పై మంచి రికార్డు ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017ను పాక్ సొంతం చేసుకోవడంలో జమాన్ ది కీలక పాత్ర అనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆటగాళ్లు ఇండియాకి చుక్కలు చూపిస్తారని పాక్ మాజీ క్రికెటర్ పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది.
👀👀👀#KamranAkmal #INDvsPAK #T20 #AsiaCup2025 #Insidesport #CricketTwitter pic.twitter.com/xbRI1rdEXY
— InsideSport (@InsideSportIND) September 12, 2025