Super Raja Movie : టాలెంట్ ఉంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ సాధించవచ్చు అని నిరూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన మౌళి కూడా లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు ఇప్పటికే 13 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు. చాలామంది సొంత ప్రయత్నాలు చేస్తూ ఇండస్ట్రీలో నిలబడాలి అనుకుంటారు.
ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసి ఉండరు అనే టైటిల్ తో ఒక సింగిల్ షాట్ సినిమా చేశాడు సూపర్ రాజా అనే ఒక వ్యక్తి. సూపర్ రాజా అనే వ్యక్తి ఆ సినిమాను ప్రేక్షకులకు చేర్చడానికి విపరీతమైన ప్రయత్నాలు చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీభత్సంగా ప్రమోషన్ చేశాడు. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ సూపర్ రాజా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
ఇకపోతే ఈ సినిమా కంప్లీట్ గా ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమాకి ఎక్కడా కూడా పాజిటివ్ టాక్ లేదు. అయితే దర్శకుడు సూపర్ రాజా థియేటర్ బయట మీడియాతో మాట్లాడుతున్న తరుణంలో పక్కనున్న ఒక ఆడియన్, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసి ఉండరు. సినిమా అంత వరస్ట్ గా ఉంది. ఈ హీరో డైరెక్టర్ యొక్క అమ్మానాన్న థియేటర్ కి రాకపోయి ఉంటే థియేటర్లోనే ఇతనిను కొట్టే వాళ్ళం అంటూ బూతు పురాణం ఓపెన్ చేశాడు. దీనిపై కొంతమంది అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి కొంతమంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ముందు వరుసలో ఉంటారు. అలానే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా బ్రహ్మరథం పడతారు. ఒకసారి సినిమా డిసప్పాయింట్ చేస్తే అదే మాదిరిగా తిడతారు కూడా. కానీ ఒక దర్శకుడి ప్రయత్నాన్ని తక్కువ చేసి మరీ ఇంతలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు. సినిమా నిరాశపరిచిన మాట వాస్తవమే, సినిమా బాలేదు అని అభిప్రాయాన్ని చెప్పొచ్చు గాని పర్సనల్ గా అబ్యూజ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. తెలుగు ప్రేక్షకులు మంచి కథలను, మంచి కాన్సెప్ట్ సినిమాలను ఎంకరేజ్ చేస్తారు అని ఇదివరకే చాలాసార్లు ప్రూవ్ అయింది. ఒకవేళ ఈ సినిమా కూడా బాగానే ఉండి ఉంటే ఖచ్చితంగా సినిమా గురించి ఎలివేషన్ ఇచ్చే వాళ్ళు.
Also Read: Ravi Basrur: ఊరు పేరునే తన పేరుగా మార్చుకున్న సంగీత దర్శకుడు.. అసలు పేరేంటంటే ?