Ravi Basrur: ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు డిసైడ్ చేయలేరు. ఒక పర్టికులర్ టైం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి రావాల్సిన సక్సెస్ కంటే కూడా రెట్టింపు సక్సెస్ వస్తుంది. దానిని కొంతమంది వన్ నైట్ స్టార్డం అని పిలుస్తూ ఉంటారు. కానీ ఆ వన్ నైట్ కంటే ముందు వాళ్ళది విపరీతమైన కష్టం ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ప్రయాణం మనకు తెలియక పలు మాటలు మాట్లాడుతూ ఉంటాం. కే జి ఎఫ్ సినిమాతో రవి బస్రూర్ పేరు బాగా పాపులర్ అయింది.
పాపులర్ అయ్యింది అంటే అది మామూలు విషయం కాదు. కే జి ఎఫ్ సినిమాకి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ రేంజ్ లో ఉంది. ఇప్పటికీ కూడా రీ రికార్డింగ్ పాడుకునేలా చేసిన సంగీత దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి తక్కువ మందిలో రవి బస్సుర్ ఒకరు.
బస్సుర్ అనేది మామూలుగా పేరు కాదు అది ఒక ఊరి పేరు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్సుర్ అని విలేజ్ పేరు పెట్టుకోవడం వెనక బిగ్ టీవీకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అసలైన విషయాన్ని రివీల్ చేశారు. రవి బస్సుర్ అసలు పేరు కిరణ్. ఒక తరుణంలో సంగీత దర్శకుడుగా ఈ లైఫ్ నాకు వద్దు అని పక్కకు తప్పుకు పోయాడు రవి.
ఇండస్ట్రీ అంతా కూడా డబ్బు కోసమే ఆలోచిస్తుంది ఇది మనకు కరెక్ట్ కాదు అనుకున్నారు. డబ్బు తర్వాత, టాలెంట్ ఇంకేమీ అవసరం లేదు, ఎమోషనల్ యాంగిల్ లేదు అనే డిసైడ్ అయి, ఆ టైంలో ఒకరు దగ్గర కామత్ అనే వ్యక్తి దగ్గర పనికి జాయిన్ అయ్యాను. నేను బేసిగ్గా శిల్పి. నేను స్టోన్ వర్క్ చేస్తాను, కామత్ అనే వ్యక్తి నన్ను తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారు. అని రవి స్వయంగా చెప్పారు.
కామత్ అనే పర్సన్ ఒక దర్శకుడు దగ్గరకు తీసుకువెళ్లిన తర్వాత, ఆ దర్శకుడు కిరణ్ అలియాస్ రవి తో విపరీతంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అతని మ్యూజిక్ టాలెంట్ గుర్తించారు. ఆ టాలెంట్ గుర్తించిన వ్యక్తి మరెవరో కాదు ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్. అందుకే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఉగ్రం సినిమాకి మొదటి అవకాశం ఇచ్చారు. అలానే రవి కూడా తన మ్యూజిక్ తో టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఆ సినిమాతో కిరణ్ కాస్త రవి బస్సుర్ మారారు.
Also Read : OG Tickets : ఆంధ్రాలో ఓజి బుకింగ్స్ ఓపెన్, ఊచకోత మొదలైంది. తెలంగాణలో అప్పుడే