BigTV English

Vegetable Pulao: రెస్టారెంట్ స్టైల్‌లో వెజిటెబుల్ పులావ్.. ఇలా చేస్తే అదిరపోయే టేస్ట్

Vegetable Pulao: రెస్టారెంట్ స్టైల్‌లో వెజిటెబుల్ పులావ్.. ఇలా చేస్తే అదిరపోయే టేస్ట్

Vegetable Pulao: రైస్ వంటకాల్లో వెజిటబుల్ పులావ్ ఒక అద్భుతమైన వంటకం. రెస్టారెంట్లు లేదా ఫంక్షన్లలో చేసే పులావ్ రుచిచాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే.. అదే రుచి ఇంట్లో తీసుకురావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజిటబుల్ పులావ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు:
బాస్మతి బియ్యం – 2 కప్పులు

నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు


నూనె – 2 టేబుల్ స్పూన్లు

ఉల్లిపాయలు – 1 (సన్నగా తరిగినవి)

అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్

పచ్చిమిర్చి – 2-3 (సన్నగా తరిగినవి)

క్యారెట్ – 1 (చిన్నగా తరిగినవి)

బీన్స్ – అర కప్పు (చిన్నగా తరిగినవి)

పచ్చి బఠానీలు – అర కప్పు

బంగాళాదుంప – 1 (చిన్నగా తరిగినవి)

కొత్తిమీర – కొద్దిగా

పుదీనా – కొద్దిగా

మసాలా దినుసులు:

బిర్యానీ ఆకు – 1

లవంగాలు – 3-4

దాల్చిన చెక్క – చిన్న ముక్క

యాలకులు – 2

అనాస పువ్వు – 1

షాజీరా – అర టీస్పూన్

తయారీ విధానం:
1. ముందుగా, బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి.

2. ఒక కుక్కర్ లేదా పెద్ద గిన్నెలో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, షాజీరా వేసి కొద్దిగా వేయించాలి.

3. ఇప్పుడు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

4. తరువాత, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.

5. ఇప్పుడు, తరిగిన కూరగాయలు (క్యారెట్, బీన్స్, బంగాళదుంపలు, పచ్చి బఠానీలు) వేసి రెండు నిమిషాలు వేయించాలి.

6. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

7. ఇప్పుడు.. నానబెట్టిన బాస్మతి బియ్యం, కొత్తిమీర, పుదీనా వేసి మెల్లిగా కలపాలి. బియ్యం విరిగిపోకుండా జాగ్రత్త పడాలి.

Also Read: రెస్టారెంట్ స్టైల్‌లో పనీర్ టిక్కా మాసాలా ? సీక్రెట్ రెసిపీ ఇదిగో

8. రెండు కప్పుల బియ్యానికి మూడున్నర కప్పుల నీరు పోసి.. బాగా కలపాలి. నీటి శాతం కరెక్ట్‌గా ఉంటే పులావ్ పొడి పొడిగా వస్తుంది.

9. కుక్కర్ మూత పెట్టి.. మీడియం మంటపై రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి.

10. రెండు విజిల్స్ వచ్చాక మంట ఆపి, కుక్కర్ లోపల ఆవిరి పోయిన తరువాత మాత్రమే మూత తెరవాలి.

11. ఆ తరువాత పులావ్ ను మెల్లిగా ఒక గరిటెతో కలిపి, వేడి వేడిగా రైతా లేదా సలాడ్‌తో సర్వ్ చేయాలి.

ఈ రెసిపీలో కొన్ని చిట్కాలు పాటిస్తే పులావ్ రుచి రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది. మసాలా దినుసులు, నెయ్యి ఎక్కువగా వాడితే మంచి సువాసన వస్తుంది. బియ్యం కరెక్ట్‌గా నానబెట్టడం కూడా చాలా ముఖ్యం. ఈ సులభమైన పద్ధతిలో ఇంట్లోనే వెజిటబుల్ పులావ్ తయారు చేసి ఆస్వాదించండి.

Related News

Double Crown Hair: తలపై రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిల్లు అవుతాయా?

Gongura Prawns Curry: గోంగూర రొయ్యల కర్రీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే !

Eggs: డైలీ ఎగ్స్ తినడం వల్ల.. మతిపోయే లాభాలు !

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఇలా అస్సలు చేయొద్దు

Pomegranates: దానిమ్మ తినేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా ?

Walking: ఖాళీ కడుపుతో లేదా తిన్న తర్వాత.. ఎప్పుడు నడిస్తే మంచిది ?

Muscle Growth: జిమ్‌కి వెళ్ళాల్సిన పనే లేదు.. మజిల్స్ పెరగాలంటే ఇవి తినండి చాలు

Big Stories

×