BigTV English

T.G.Vishwa Prasad: అకీరా కోసం వీరమల్లుకు సాయం.. పెద్ద ప్లాన్ వేసిన విశ్వ ప్రసాద్?

T.G.Vishwa Prasad: అకీరా కోసం వీరమల్లుకు సాయం.. పెద్ద ప్లాన్ వేసిన విశ్వ ప్రసాద్?

T.G.Vishwa Prasad: సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీ.జీ విశ్వప్రసాద్ (T.G Vishwa Prasad)ఒకరు. ఈయన నిర్మాణ సారధ్యంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. త్వరలోనే మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయనకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విశ్వ ప్రసాద్ సినీ నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు అత్యంత సన్నిహితుడనే విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించడంతో ఈయన ఏకంగా సినిమా సెలబ్రిటీలకు ఘనంగా పార్టీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో విశ్వప్రసాద్ కు అంత మంచి అనుబంధం ఉంది.


అకీరా కోసమే సాయమా?

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా నిర్మాణ పనులలో పెద్ద ఎత్తున సహాయం చేశారు అంటూ వార్తలు వినపడుతున్నాయి అయితే ఈ సహాయం చేయడం వెనుక కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా(Akira) త్వరలోనే హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకీరా నందన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం కోసమే వీరమల్లు సినిమా నిర్మాతకు ఈయన సహాయం చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు మారుమోగుతున్నాయి.


పవన్ అందుకే థాంక్స్ చెప్పారు..

ఇలా ఈయన గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో విశ్వప్రసాద్ స్పందించారు. తాజాగా విశ్వప్రసాద్ ఈ విషయంపై మాట్లాడుతూ.. తాను అకీరాతో సినిమా చేసే అవకాశం అందుకోవాలనే ఉద్దేశంతోనే వీరమల్లు సినీ నిర్మాతకు సహాయం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. నిర్మాత రత్నం గారికి అవసరం కావడంతోనే తాను సహాయం చేశానని, ఈ సహాయాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తనకు థాంక్స్ చెప్పారే తప్ప అకీరాతో సినిమా చేయడం కోసమే సాయం చేశాననే మాట పూర్తిగా అవాస్తవమని విశ్వ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

అవకాశం నాకు వచ్చిన చేస్తా…

ఇక పవన్ కళ్యాణ్ వారసుడుగా అకీరా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే తప్పకుండా అతనిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ అవకాశం నాకు వచ్చిన తప్పకుండా నేను అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని విశ్వప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం వీర మల్లు సినిమా గురించి అలాగే అకీరా గురించి విశ్వప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన సినిమాల విషయానికొస్తే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ ఐదో తేదీ విడుదల కాబోతుందని వెల్లడించారు. కానీ వచ్చేయేడాది సంక్రాంతికి రాబోతుంది అంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇక ఈ సినిమా విడుదల గురించి నిర్మాతలు అధికారక ప్రకటన మాత్రం వెల్లడించలేదు.

Also Read: Tamannaah Bhatia : ఆ బడా హీరో చేతిలో దారుణ అవమానం.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన తమన్నా!

Related News

Anushka Ghaati : ఘాటీ ఎందుకు చూడాలి… అనుష్కతో పాటు 7 రీజన్స్ ఇవే!

Tamannaah Bhatia : ఆ బడా హీరో చేతిలో దారుణ అవమానం.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన తమన్నా!

Coolie : క్లైమాక్స్ కాదు, ఇంట్రడక్షన్ కాదు… హైలైట్ సీన్ ఇదే.. రివీల్ చేసిన లోకి 

Mythri Movie Makers : మైత్రీ పదేళ్ల ప్రయాణం… వాళ్ల హిట్స్ అండ్ ప్లాప్స్ ఇవే

CPI Narayana: మేకప్ లేకుండా రజినీకాంత్ ను చూశారా.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

×