BigTV English

Anushka Ghaati : ఘాటీ ఎందుకు చూడాలి… అనుష్కతో పాటు 7 రీజన్స్ ఇవే!

Anushka Ghaati : ఘాటీ ఎందుకు చూడాలి… అనుష్కతో పాటు 7 రీజన్స్ ఇవే!

Anushka Ghaati : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది అనుష్క శెట్టి(Anushka Shetty). ‘సూపర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి, ఊహించని ఇమేజ్ అందుకుంది. ముఖ్యంగా కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు అప్పట్లో స్టార్ హీరోలకి కూడా పోటీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాలతో ఈమె రేంజ్ అమాంతం పెరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాలు ఈమెకు మంచి కెరియర్ ను అందించలేకపోయాయనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి.


ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న అనుష్క..

ఈ సినిమాలో తర్వాత నిశ్శబ్దం, భాగమతి, సైజ్ జీరో వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమయింది. ఇక చాలాకాలం తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇప్పుడు ‘ఘాటీ’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఎప్పుడో జూలైలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. కొంచెం సీజీ వర్క్ పెండింగ్లో ఉండడం వల్ల వాయిదా పడింది. ఆంధ్ర – ఒరిస్సాల నడుమ ఉన్న భారీ సుంకీ ఘాటీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఘాట్ రోడ్డు మీద ఆధారపడి బ్రతికే వారిని ఘాటీ లు అంటారని, వారి జీవితం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు క్రిష్ కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నట్లు సమాచారం. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


వాటి కోసమైనా అనుష్క ఘాటీ చూడాల్సిందే..

ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదలవ్వగా.. ప్రత్యేకించి కొన్ని అంశాల కోసమే సినిమా చూడాలనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. అనుష్క ఇందులో చాలా అద్భుతంగా నటించిందని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో గంజాయి స్మగ్లింగ్ , ఘాటీలు, వారు గంజాయి పండించడం, రవాణా చేయడం వంటి పనులు , దానివల్ల కలిగే ఇబ్బందులు, ఆ పని ఆపేయాలనే అనుష్క ప్రయత్నం ఇవన్నీ కూడా సినిమాలో చూపించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఒక ఏడు యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయని, అవే సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అని సమాచారం. ముఖ్యంగా ఈ యాక్షన్ సీన్ల వల్లే ఈ సినిమా విడుదల ఇన్ని రోజులు వాయిదా పడిందట. ఇక ఆ ఏడు యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు.. సీక్వెన్స్ లో అనుష్క ఇచ్చే పర్ఫామెన్స్ కోసమైనా కచ్చితంగా సినిమా చూడాలని కొంతమంది చెబుతున్నారు. మరి వీటి కోసమే సినిమా థియేటర్ కి వెళ్తే.. మరి ఈ సన్నివేశాలు ఆడియన్స్ ఆశలకు ఏ మేరకు ఊపిరి పోస్తాయో చూడాలి. సాధారణంగా అనుష్క యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పాత్ర ఏదైనా సరే తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మెప్పిస్తుంది. మరి ఈ ఘాటీ సినిమాతో ఏ విధంగా మెప్పించబోతుందో చూడాలి.

ALSO READ: Mahesh Babu: మహేష్ బాబు వాడే వ్యానిటీ వాన్ ఖరీదు తెలిస్తే గుండె గుబేల్!

Related News

Pawan Kalyan: అప్పట్లో ఇలాంటి టీమ్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదు!

OG Concert: పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు… మనల్ని ఆపేది ఎవరు..జోష్ నింపిన పవన్!

Pawan Kalyan: సుజీత్ కు పిచ్చి పట్టుకుంది, పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడానికి అదే కారణం

OG concert: ఓజీ రివ్యూ ఇదే..మీసం మెలేసిన తమన్…అంత కాన్ఫిడెంట్ ఏంటీ భయ్యా!

OG Movie : చంపేస్తే చంపేయండి రా… ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి, ఓజి సినిమా చిక్కులు

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..

Jacqueline Fernandez: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్!

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Big Stories

×