Tharun Bhascker:తరుణ్ భాస్కర్..ఒకవైపు దర్శకుడిగా మరోవైపు నటుడిగా సత్తా చాటనున్న ఏ మల్టీ టాలెంటెడ్ తాజాగా ENE రిపీట్ అనే సినిమాతో మరోసారి ఆడియన్స్ ని పలకరించిన సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు కొల్లగొడుతుండటంతో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో ఇలా పలు విషయాల్ని చెప్పుకొచ్చాడు.
ఈ సందర్బంగా తరుణ్ భాస్కర్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఈ సినిమా తనకు కేవలం ఒక హిట్ మాత్రమే ఇవ్వలేదని, ఒక డైరెక్టర్‌గా ప్రేక్షకుల నుంచి తనకు రావాల్సిన అసలైన ప్రేమను, గుర్తింపును పూర్తిస్థాయిలో అందించిందని ఆనందాన్ని బయటపెట్టాడు.
తన సినిమా కోసం పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలతో పాటు తనకు అండగా నిలిచిన అభిమానులకు, కంటెంట్ క్రియేటర్లకు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక ఈ సినిమాను కొత్త నటీనటులతో తీసినప్పుడు మొదట్లో తనలో కొంచెం టెన్షన్ ఉండేదని పాత వైబ్‌ను మళ్లీ తీసుకురావడం అంత ఈజీ కాదని, ఎక్కడైనా సినిమా టోన్ మారుతుందేమోనని భయపడినట్లు చెప్పుకొచ్చాడు.
కానీ మధురిమ, శివాత్మిక, ప్రియదర్శి, రామ్, కరుణ కుమార్, శ్రీరామచంద్ర లాంటి నటీనటులు తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారని , వారిలో కొందరు ప్రొఫెషనల్ డాన్సర్లు, సింగర్లు కావడం సినిమాకు బాగా ప్లస్ అయిందన్నాడు .
సీనియర్ జర్నలిస్ట్ రామ్, డైరెక్టర్ కరుణ కుమార్ సెట్‌లోకి చాలా నేచురల్‌గా వచ్చి తమ పాత్రలను సులభంగా చేసేయడంతో తన పని కూడా ఈజీ అయిందని తెలిపాడు.అలాగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సమయం సరిపోక తన డైరెక్షన్ టీమ్ పేర్లు చెప్పలేకపోయానని గుర్తు చేసుకుంటూ వీళ్లందరి కష్టం వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందని, వాళ్ల తల్లిదండ్రులు గర్వపడాలని అన్నాడు.
ఇండస్ట్రీలో డైరెక్షన్ టీమ్ పనిని ఏదో కూలి పనిలా కాకుండా, ఎంతో ఇష్టంతో, క్రియేటివిటీతో చేసే పనిగా గుర్తించి తగిన గౌరవం, పారితోషికం ఇవ్వాలని తన మనసులోని మాటని బయటపెట్టాడు. ‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో మీమ్ పేజీల పాత్ర ఎంతో ఉందని మెచ్చుకున్నాడు.
. ముఖ్యంగా ‘తాగుదాం’ డైలాగ్ మీమ్స్ ద్వారా తనకు ఒక స్పెషల్ గుర్తింపు వచ్చిందని చెప్పాడు.. సినిమా విజయాన్ని కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లతో కొలవలేమని, ప్రేక్షకులు చూపించే ప్రేమే అసలైన విజయమని ఎమోషనల్ అయ్యాడు తరుణ్.
ఒక కళాకారుడిని ప్రోత్సహించడానికి అతడి కులం, నేపథ్యం, ఆర్థిక స్థాయి లాంటివి చూడకూడదని తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో చూడకుండా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తన కంటెంట్‌ను నమ్మి ఈ స్థాయికి తీసుకొచ్చారని ఎమోషనల్ అయ్యాడు .
నిజాయితీతో పనిచేసే ఆర్టిస్టులను ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలని, ఇకపై తను కేవలం ఒక వర్గం ప్రేక్షకుల కోసమే కాకుండా ఏ, బీ, సీ సెంటర్ల ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా సినిమాలు చేస్తానని చెప్పడం విశేషం. చూడాలి మరి ఇప్పటి నుండి లెక్కలు మారిపోతాయి అంటున్న తరుణ్ ముందు ముందు ఎలాంటి సినిమాలతో పలకరిస్తాడో !
ALSO READ:అప్పులు చేసి మరీ ఆఫీసుల చుట్టూ తిరిగాను.. గతాన్ని గుర్తుచేసుకుని ఏడ్చేసిన విశ్వక్ సేన్!