Sathvika Veeravalli:సాత్విక వీరవల్లి..ఈ పేరిపుడు ఒక సెన్సేషన్ అయింది నటించిన తొలి సినిమా ఆకాశంలో ఒక తార బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్ళని కొల్లగొడుతుండటంతో ఈ అమ్మడి పేరు మారుమ్రోగిపోతుంది.
ముఖ్యంగా సినిమాలో సాత్విక ఇచ్చిన ఫెర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయాడు ఆడియన్స్.ఇక ఈ సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్యాక్ గ్రౌండ్ గురించి,అలాగే తన సినిమా కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చింది.
తాను అమెరికాలో పుట్టి పెరిగినా, తల్లిదండ్రుల తమిళ మూలాలు, నాన్న హైదరాబాద్‌లో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచే తెలుగుతో మంచి కనెక్షన్ ఉందని చెప్పుకొచ్చింది.అయితే ఇంజినీరింగ్ చదివి మంచి జాబ్‌లో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉన్నా, నటన మీద ఉన్న ప్యాషన్‌తో ఆ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చానని తెలిపింది.
ఇక తను నటించిన ‘ఆకాశంలో ఒక తార’ గురించి చెబుతూ ఇందులో తాను కల్పన అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించానని , చిన్న ఊరిలో ఉంటూ అంతరిక్షంలోకి వెళ్లి వ్యోమగామి కావాలని కలలు కనే క్యారెక్టర్ ఇదని, కానీ రియల్ లైఫ్‌లో తనకు, కల్పనకు అస్సలు పోలిక లేదని చెప్పుకొచ్చింది.సినిమాలో కల్పన చాలా అమాయకంగా, స్లోగా మాట్లాడుతుంటుంది కానీ, నిజ జీవితంలో తనకు ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే సూటిగా చెప్పేస్తానని తేల్చిచెప్పింది.
ఇక ఈ క్యారెక్టర్ కోసం తన చిన్ననాటి జ్ఞాపకాలు, స్పేస్ అండ్ ఆస్ట్రానమీ మీద ఉన్న ఇంట్రెస్ట్‌ను వాడుకున్నానని ,అమెరికాలో పెరిగిన తనకు విలేజ్ గర్ల్ రోల్ చేయడం పెద్ద ఛాలెంజ్ అని, ఫస్ట్ టైమ్ స్కూల్ యూనిఫామ్‌లో తనను తాను చూసుకున్నప్పుడు అసలు ఇది చేయగలనా అని డౌట్ వచ్చిందని గుర్తు చేసుకుంది.
ఇక రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న RC 17 సినిమాలో సాత్విక హీరోయిన్‌గా నటిస్తోందంటూ వస్తున్న రూమర్స్‌పై రియాక్ట్ అయింది సాత్విక .ఆ సినిమాలో ఎవరు చేసినా వాళ్లకు ఆల్ ది బెస్ట్ అని చెబుతూ, కెరీర్ విషయంలో ఏదీ తొందరపడకుండా, ఒక్కో మెట్టు ఎక్కుతూ, స్టోరీ, క్యారెక్టర్, డైరెక్టర్ విజన్ చూసి నిర్ణయాలు తీసుకుంటానని మనసులోని మాటని బయట పెట్టింది.
ఇక కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లతో చర్చలు జరుగుతున్నా,వచ్చిన కొన్ని వార్తలు మాత్రం పుకార్లేనని తేల్చి చెప్పింది. ఇక ఫస్ట్ మూవీ కంప్లీట్ అయ్యే టైమ్‌కే మరో తెలుగు సినిమా, ఒక తమిళ సినిమా ఆఫర్లు వచ్చాయని, కానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ రావాల్సి ఉందని చెప్పింది.
చూడాలి మరి నర్మగర్బంగా తెలుగు సినిమా అని హింట్ ఇచ్చిన సాత్విక చరణ్ సినిమాలోనే తళుక్కు మంటుందా లేక మరి ఇంకేదైనా సినిమా అయిఉంటుందా అన్నది కాలమే డిసైడ్ చేయాలి .
ALSO READ:శర్వానంద్ సినిమా కోసం ఇంత ఖర్చు చేశారా? భోగి బడ్జెట్ తెలిస్తే షాక్!