E-Paper
Advertisement

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. హిట్ కొడితే వాడే కింగ్!

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. హిట్ కొడితే వాడే కింగ్!
Advertisement

Sampath Nandi:భోగి సినిమాతో ఈనెల 27న పలకరించనున్న దర్శకుడు సంపత్ నంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినిమా జర్నీ గురించి ,ఇండస్ట్రీలో ఉండే పరిస్థితుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు.

సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే కథ ఎప్పటికీ జనాల మనసుల్లో నిలిచిపోతుందని చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే రివ్యూలన్నింటినీ తాను చాలా శ్రద్ధగా చదువుతానని, ఇప్పటివరకు ఏ క్రిటిక్‌ను కూడా తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చారని అడగలేదని అన్నారు.ఇక ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుందని, మనం నిజంగా మంచి సినిమా తీసిన రోజు మంచి రేటింగ్ వస్తుందని తన మనసులోని మాటని బయటపెట్టాడు

Advertisement

ఇక ప్రస్తుతం సోషల్ మీడియా జమానాలో రీల్స్ చేసే వాళ్లతో సహా ప్రతి ఒక్కరూ క్రిటిక్సే అని సెటైర్ వేశారు , ఇకపోతే నెగిటివ్ రివ్యూలను ఇచ్చే సైట్స్ ని కూడా తాను ఫాలో అవుతానని, ఎందుకంటే మన చుట్టూ ఉండేవాళ్లు ఎప్పుడూ మనల్ని పొగుడుతూనే ఉంటారు కాబట్టి, తప్పులు ఎక్కడున్నాయో చెప్పేవాళ్ల వల్లే మనం నేర్చుకోగలమని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

ఇక డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తన జర్నీ గురించి మాట్లాడుతూ, తనకు నిర్మాతగా ఉండటం కంటే దర్శకుడిగా కొనసాగడమే చాలా ఇష్టమని తేల్చేశాడు . ఖాళీగా ఉన్నప్పుడు కూడా కొత్త కథలు రాసుకుంటూనే ఉంటానని చెప్పారు.

Advertisement

ప్రొడ్యూసర్ అయితే డబ్బులకు సంబంధించిన టెన్షన్ ఉంటుందని, అదే డైరెక్టర్ అయితే క్రియేటివ్ టెన్షన్ ఉంటుందని, తనకు ఆ క్రియేటివ్ టెన్షనే ఇష్టమని అన్నారు. ఇంకో పాతికేళ్ల పాటు డైరెక్టర్‌గానే సినిమాలు తీయాలనుకుంటున్నానని, కేవలం ఇతరులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే అప్పుడప్పుడు నిర్మాతగా మారానని తెలిపారు.

ఇక ఇండస్ట్రీలో ఎదగాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదని, సరైన కాంటాక్ట్స్ కూడా ఉండాలని కుండబద్దలు కొట్టారు సంపత్ నంది. ముఖ్యంగా పెద్ద హీరోలతో, వాళ్లకు దగ్గరగా ఉండేవాళ్లతో పరిచయాలు ఉంటే పెద్ద సినిమాలు చేసే ఛాన్స్ వస్తుందని అసలు విషయంచెప్పారు .

పెద్ద హీరో దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి కథ చెప్పడం కంటే, ఆయనకు తెలిసిన వాళ్ల ద్వారా మన కథ గురించి ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తే, ఆ తర్వాత మనం కథ చెప్పినప్పుడు వాళ్లకు ఆసక్తి పెరుగుతుందని వివరించారు. అయితే అంతిమంగా టాలెంట్‌కే ఎక్కువ విలువ ఉంటుందని, కాంటాక్ట్స్ ఉంటే చిన్నగా తీయాల్సిన సినిమాను పెద్ద రేంజ్‌లో తీసే అవకాశం దక్కుతుందని వివరించారు.

ఇక ఒక పెద్ద హిట్ కొట్టిన డైరెక్టర్‌కు వెంటనే ఛాన్సులు రాకపోవడం, ఫ్లాప్ ఇచ్చిన వాళ్లకు వరుస ఆఫర్లు రావడం గురించి మాట్లాడుతూ  ఒక సినిమాను మొదలుపెట్టి, పూర్తి చేసి, హిట్ కొట్టడం అంత ఈజీ కాదన్నారు.

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా హిట్ కొట్టిన ప్రతి డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ తన దృష్టిలో కింగే అని తేల్చేశారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలోని పరిస్థితులపై సంపత్ నంది చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి .

ALSO READ:రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్..‌అసలు విషయం చెప్పేసిన సాత్విక వీరవల్లి!

Tags

Related News

బాగా ఏడవాలని ఉంటుంది కానీ.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!

రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్..‌అసలు విషయం చెప్పేసిన సాత్విక వీరవల్లి!

‘ఆకాశంలో ఒక తార’ పై మెగా ప్రశంసలు.. భావోద్వేగానికి లోనయ్యానంటూ!

శర్వానంద్ సినిమా కోసం ఇంత ఖర్చు చేశారా? భోగి బడ్జెట్ తెలిస్తే షాక్!

ప్రీ స్కూల్లో అడుగుపెట్టిన క్లిన్ కారా … ఫీజు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే!

సినిమా ఒప్పుకోవాలంటే నాకు అవి రెండూ కావాలి.. మీనాక్షి అసలు లెక్క ఇదే!

జంబలకిడి పంబ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×