Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమా(Vrushakarma) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మైథాలజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 4వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. నాగ చైతన్య (Nagachaitanya)ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా యూట్యూబర్ జాస్తి(Jasti Srinivas)తో కలిసి రామగిరి కొండపై ట్రెక్కింగ్ కు వెళ్లారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రెక్కింగ్ వెళ్లారు ఈ ట్రెక్కింగ్ సమయంలో సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
ఈ నేపథ్యంలోనే యూట్యూబర్ జాస్తి నాగచైతన్యను ప్రశ్నిస్తూ మీరు ఎప్పుడైనా ఏడ్చారా అన్న? అంటూ అడిగారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతున్న నాకు బాగా ఏడవాలని ఉంటుంది కానీ కన్నీళ్లు రావు. ఇలా బాధ కలిగినప్పుడు తాను మనసులోనే చాలా బాధపడుతూ ఉంటానని ఈ సందర్భంగా నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇలా నాగచైతన్య తనకు ఏడవాలని ఉంది కానీ ఏడవలేను అంటూ చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ట్రెక్కింగ్ లో భాగంగా వృషకర్మ సినిమాకి సంబంధించి కూడా ఎన్నో విషయాలను తెలిపారు. నాగచైతన్య సినీ కెరియర్ లోనే వృషకర్మ సినిమా భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుమారు 110 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary ) హీరోయిన్గా నటించారు. ఈమె దక్ష అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య ధర్మం కోసం పోరాటం చేసే ఒక యోధుడి పాత్రలో కనిపించగా మీనాక్షి చౌదరి మాత్రం పురావస్తు శాఖ శాస్త్రవేత్తగా కనిపించబోతున్నట్లు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది.
ఇలా నాగచైతన్య ఇప్పటివరకు తన సినీ కెరియర్లో టచ్ చేయని జానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విషయంలో నాగచైతన్య కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. ఇక 25వ తేదీ ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా ద్వారా నాగచైతన్య ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ‘ఆకాశంలో ఒక తార’ పై మెగా ప్రశంసలు.. భావోద్వేగానికి లోనయ్యానంటూ!