E-Paper
Advertisement

అప్పులు చేసి మరీ ఆఫీసుల చుట్టూ తిరిగాను.. గతాన్ని గుర్తుచేసుకుని ఏడ్చేసిన విశ్వక్ సేన్!

అప్పులు చేసి మరీ ఆఫీసుల చుట్టూ తిరిగాను.. గతాన్ని గుర్తుచేసుకుని ఏడ్చేసిన విశ్వక్ సేన్!
Advertisement

Vishwak Sen:విశ్వక్ సేన్ ..వెళ్ళిపోమాకే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే.ఇక తాజాగా విశ్వక్ నటించిన ENE రిపీట్ అనే సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఇలా తన జర్నీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టాడు.

ఎనిమిదేళ్ల క్రితం మొదలైన తన సినిమా జర్నీ ఇవాళ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుందంటూ ఎమోషనల్ అయిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు.

Advertisement

ప్రీమియర్లకు రెండు రోజుల ముందే ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమా చూశాక తనకు మాట రావడానికి గంటన్నర పట్టిందని, తెల్లవారుజామున ఏడు గంటల వరకు టీమ్‌తో కూర్చొని సీన్లు, క్యారెక్టర్ల గురించి మాట్లాడుకున్నామని చెప్పాడు.

కుటుంబ బంధాలు, ఫ్రెండ్‌షిప్, ఆఫీస్‌లో మనుషుల మధ్య ఉండే రిలేషన్స్ అన్నీ మన నిజ జీవితంలో జరిగినట్టుగా అనిపించాయని డైరెక్టర్ తరుణ్ ని మెచ్చుకున్నాడు.

Advertisement

తన 16వ ఏజ్ లో ముంబైలో ఫిల్మ్ స్కూల్‌లో చేరి, 17 ఏళ్ల నుంచే హైదరాబాద్ కృష్ణానగర్, గణపతి కాంప్లెక్స్ చుట్టూ ఆడిషన్ల కోసం తిరిగిన రోజులను విశ్వక్ గుర్తు చేసుకున్నాడు . చిన్న వేషమైనా పర్వాలేదని ఆఫీసుల చుట్టూ గంటల తరబడి ఎదురుచూసేవాడినని , 21 ఏళ్ల వయసులో నాలుగేళ్ల కష్టం తర్వాత ఒక సినిమాలో నాలుగో హీరోగా చేయడానికి సిద్ధపడ్డా ఆ అవకాశం కూడా చేజారిపోయిందని వాపోయాడు .

సినిమా నుంచి తీసేసినా 20 రోజులు అదే ఆఫీస్‌కు వెళ్లి, అప్పులు చేసి మరీ మర్యాదలు చేసిన విషయం తెలిసి ఇంట్లో మూడు రాత్రులు ఏడ్చానని, తల్లిదండ్రులు కూడా బాధపడ్డారని ఎమోషనల్ అయ్యాడు.ఆ బాధలోనే దర్శకుడిగా మారాలని నిర్ణయించుకుని, డీఎస్ఎల్ఆర్ కెమెరాతో వెయ్యి మందికి ఆడిషన్లు చేసి ఫలక్‌నుమా దాస్ మొదలుపెట్టానని ఆనాటి రోజులని గుర్తు చేసుకున్నాడు.

అదే టైమ్‌లో తరుణ్ భాస్కర్ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసినా మొదట మిస్ అయ్యానని ,తర్వాత తరుణ్ భాస్కర్ స్వయంగా పిలిచి డేట్స్ అడగ్గా, తన సినిమా ఆపేసైనా చేస్తానని చెప్పానని గుర్తుచేసుకున్నాడు.

తరుణ్ చెప్పిన కథ చదువుతుంటే తన జీవితాన్నే పేపర్ మీద రాసినట్టు అనిపించిందని, పోలీస్ స్టేషన్ సీన్ డైలాగ్ చెప్పగానే టీమ్ అంతా చప్పట్లు కొట్టి ఐదు నిమిషాల్లో సెలెక్ట్ చేశారని చెప్పుకొచ్చాడు.

కానీ ఆ తర్వాత తనపై ఒక అమ్మాయి పేరుతో నకిలీ ఈమెయిల్ వచ్చిందని, గొడవపడ్డ వ్యక్తి కావాలనే బ్యాడ్ చేయడానికి అలా చేశాడని చెప్పారు. తన బ్యాక్‌గ్రౌండ్ చూడకుండా తరుణ్ ఆ మెయిల్ చూపించి నమ్మారని, తాను పాతాళంలోకి పడిపోతుంటే షర్ట్ పట్టుకొని పైకి లాగింది తరుణ్ భాస్కరేనని తన మనసులోని కృతజ్ఞతని బయటపెట్టాడు విశ్వక్ .

ALSO READ:రాజమౌళి మహాభారతం.. నా దగ్గర అభిమన్యుడి స్టోరీ… అసలు విషయం చెప్పిన గుణ్ణం

Tags

Related News

రాజమౌళి మహాభారతం.. నా దగ్గర అభిమన్యుడి స్టోరీ… అసలు విషయం చెప్పిన గుణ్ణం

చిన్నారి నాన్న పాప గుర్తుందా? ఇప్పుడు ఎంత స్టైలిష్‌గా మారిపోయిందో!

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. హిట్ కొడితే వాడే కింగ్!

బాగా ఏడవాలని ఉంటుంది కానీ.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!

రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్..‌అసలు విషయం చెప్పేసిన సాత్విక వీరవల్లి!

‘ఆకాశంలో ఒక తార’ పై మెగా ప్రశంసలు.. భావోద్వేగానికి లోనయ్యానంటూ!

శర్వానంద్ సినిమా కోసం ఇంత ఖర్చు చేశారా? భోగి బడ్జెట్ తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×