Gunnam Gangaraju:గుణ్ణం గంగరాజు..తెలుగు ఆడియన్స్ కి లిటిల్ సోల్జర్స్ లాంటి సూపర్ ఫిలిమ్ ని అందించిన ఈ క్రేజీ వెటరన్ ఫిలిమ్ మేకర్ అమృతం వంటి కల్ట్ బుల్లితెర ప్రోగ్రామ్ ని మనకి అందించిన సంగతి తెల్సిందే.
ఇక ఈ మధ్య వచ్చిన ఆకాశంలో ఒక తార సినిమాకి డైలాగ్స్ అందించిన గుణ్ణం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చాడు.
గుణ్ణం మాట్లాడుతూ సినిమాల్లో లాజిక్ కచ్చితంగా ఉండాలని, థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా అందులోని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోవాలని ఆయన తన అభిప్రాయాన్ని బయట పెట్టారు.
సినిమా మేకింగ్ సమయంలో తనతో పనిచేసే అసోసియేట్స్, నిర్మాతలు, అనుభవజ్ఞుల సలహాలను తను ఎప్పుడూ లెక్కలోకి తీసుకుంటానని తెలిపారు. అయితే సలహా చెప్పేవాళ్ల వయసు, జెండర్ కంటే ఆ ఐడియాలో ఎంత విషయం ఉందనే దానికే తను విలువ ఇస్తానని వివరించారు.
ఇక ఒకే వయసున్న వాళ్ల మధ్య కూడా ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, ఐడియా నచ్చితే తీసుకుంటానని నచ్చకపోతే తన అభిప్రాయం చెబుతానని చెప్పుకొచ్చారు.. ఇక సినిమాల కమర్షియల్ సక్సెస్ గురించి మాట్లాడుతూ, ప్రతి సినిమాను లాభనష్టాల లెక్కలతో తను తీయలేదని అన్నారు.
ఒకే ఇంట్లో ఉండే నలుగురికి నాలుగు రకాల ఇష్టాలు ఉన్నప్పుడు, థియేటర్‌కు వచ్చే వేలాది మంది ప్రేక్షకులకు ఏ సీన్ నచ్చుతుంది, ఏ పాట కనెక్ట్ అవుతుందని ముందే అంచనా వేయడం ఎవరి వల్లా కాదని తేల్చేశారు.అందుకే బాక్సాఫీస్ లెక్కల కంటే తనకు నచ్చిన, నమ్మకం కలిగించిన కథను హానెస్ట్ గా తెరకెక్కించడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
ఇక తన కెరీర్లో మైలురాయిగా నిలిచిన లిటిల్ సోల్జర్స్ గురించి చెబుతూ అప్పట్లో హీరో అంటే పది మందిని, వంద మందిని కొట్టి సమస్యను పరిష్కరించేవాడని,కానీ శారీరకంగా బలహీనంగా ఉన్న వాళ్లకు ఒక కష్టం వస్తే ఎలా ఎదుర్కొంటారు? అనే ప్రశ్న నుంచే ఆ కథ మొదలైందని వివరించారు.
ఇక ఇప్పటికీ ఆ సినిమాను వందలసార్లు చూసి కళ్లలో నీళ్లు తిరుగుతాయని అభిమానులు చెబుతుంటే, ఒక దర్శకుడిగా అంతకంటే సంతృప్తి ఇంకేముంటుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఇక ఈ మధ్య చూసిన ఇరుముడి తనకు ఎంతగానో నచ్చిందని,తాను పెద్దగా భక్తుడిని కాకపోయినా అందులోని మూడు భజన పాటలు, మల్లెపూల విజువల్స్ చాలా బాగా నచ్చాయని చెప్పారు. తన నమ్మకాల గురించి మాట్లాడుతూ, దేవుడు ఉన్నాడనడానికి కానీ, లేడనడానికి కానీ తన దగ్గర ఆధారాలు లేవని చెప్పారు.ఇక రామాయణం, మహాభారతం లాంటి పురాణాలు తనకు ఎంతో ఇష్టమని, ముఖ్యంగా మహాభారతంలో లేని పాత్రలు, మలుపులు ప్రపంచంలో మరెక్కడా ఉండవని అన్నారు.
ఇక రాజమౌళి మహాభారతం సినిమా గురించి మాట్లాడుతూ తన దగ్గర కూడా అర్జునుడి కొడుకు అభిమన్యుడి కథపై ఐదారు పేజీల లైన్ సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో తన కొడుకు పెద్ద నిర్మాతగా ఎదిగినప్పుడు ఆ భారీ సినిమాను చేసే అవకాశం ఉందని సరదాగా చెప్పుకొచ్చారు.
ALSO READ:చిన్నారి నాన్న పాప గుర్తుందా? ఇప్పుడు ఎంత స్టైలిష్‌గా మారిపోయిందో!